కుర్ర హీరోలు అవే కథల తో ?

0

టాలీవుడ్ లో ప్రస్తుతం పాత చింతకాయ పచ్చడి కథలు మళ్లీ పుంజుకుంటున్నాయి. పీరియాడిక్ పేరుతో కొందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పేరు తో మరి కొందరు చూసేసిన కథల్నే మళ్లీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ రెండు సినిమాల్లో ప్రేక్షకులు చూసిన కథలే మళ్లీ రిపీట్ అవుతున్నాయనే వార్త వినిపిస్తున్నాయి.

అవే ‘ప్రతి రోజు పండగే’ ‘శ్రీకారం’. సాయి తేజ్ నటిస్తున్న ‘ప్రతి రోజు పండగే’ నుండి రిలీజయిన సాంగ్స్ టీజర్ ‘గోవిందుడు అందరి వాడేలే’ ‘శతమానం భవతి’ సినిమాలు గుర్తు చేస్తున్నాయి. ఒక తాత ఆయనకి దూరంగా ఎక్కడో ఫారెన్ లో కొడుకు మనవడు వాళ్ళు ఊరికి తిరిగి రావడం ఎమోషనల్ క్లైమాక్స్ తో కన్నీళ్లు. ఈ స్టోరీ లైన్ ‘సీతారామయ్య గారి మనవరాలు’ నుండి ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. కాకపోతే ట్రీట్ మార్చి ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. అందుకే మారుతి కథ కంటే ఎక్కువ గా కామెడీ నే నమ్ముకున్నాడట.

ఇక శర్వా ‘శ్రీకారం’ రైతులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఊరు వ్యవసాయం ఓ మెసేజ్ ఇదే లైన్ తో సినిమా ఉంటుందట. లేటెస్ట్ గా మహేష్ మహర్షిలో కూడా ఇదే చూపించారు. మరి ఇండిపెండెంట్ డైరెక్టర్ మరో సారి ఈ కథతో సిల్వర్ స్క్రీన్ పై ఏం చూపించి మెప్పిస్తాడో ?
Please Read Disclaimer