ఆలోచిస్తే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేయకపోవచ్చు..!

0

కరోనా లాక్ డౌన్ తో సినిమా థియేటర్స్ మూతబడి పోవడంతో యాజమాన్యాలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్.. ఇలా అందరూ నష్టాలు చవి చూశారు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి కాస్త తగ్గడంతో.. కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో థియేటర్స్ ప్రారంభించాలని పలు ఏరియాల్లో థియేటర్ ఓనర్స్ అసోసియేషన్స్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడా థియేటర్స్ ఓపెన్ చేసి ఓల్డ్ మూవీస్ ని ప్రసారం చేశారు. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ఓపెన్ చేయడం మరియు కోవిడ్ సేఫ్టీ మెజర్స్ కూడా అందించాల్సి రావడంతో మరింత భారం పెరిగిందని అంటున్నారు.

ఇదిలాగే కొనసాగితే సినిమాల వల్ల థియేటర్ నిర్వహణకు కూడా రాబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆలోచించే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా థియేటర్స్ రీ ఓపెన్ చేసుకిడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార కోణంలో ఆలోచిస్తే ఇప్పట్లో థియేటర్స్ తెరవకపోవడమే మంచిదని కొందరు సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతి వచ్చే సూచనలు కనిపించడం లేదని.. అప్పటి వరకు ప్రేక్షకులు కూడా లైఫ్ రిస్క్ చేసి థియేటర్ కి రావడానికి ఆలోచిస్తారని అంటున్నారు. ఇదే విధంగా జరిగితే మరో ఆరు నెలలు పాటు కొత్త సినిమాలు థియేటర్ లో విడుదల అవ్వకపోవచ్చు. ఒకవేళ థియేట్రికల్ రిలీజ్ కి ముందుకు వచ్చినా సినిమాను ఔట్ రేట్ కి కొనుక్కుంటే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ లో సినిమా విడుదల చేస్తే వసూళ్లు రాబట్టుకోవడం చాలా కష్టం అనే వాదనలు ఫిలిం సర్కిల్స్ లో వినిస్తున్నాయి. మరి ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చూడాలి.