నమస్తేలో స్టైలు ఉందంటున్న బుట్టబొమ్మ!

0

కెరీర్ పరంగా పూజా హెగ్డే ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈమధ్య ఇన్స్టా ఖాతా పోస్టు.. హ్యాకింగ్ ఎపిసోడ్ లో మాత్రం తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఎవరో ట్రోల్ చేస్తారని.. ఎవడో కామెంట్ చేస్తాడని భయపడుతూ కూర్చుంటే ఇక అలానే ఎప్పటికి అలా కూర్చునే ఉండాల్సి వస్తుంది.. అయితే అల బ్యూటీ అలా కాదు కదా. అందుకే ఓ కొత్త పోస్ట్ తో వచ్చింది.

తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసి ‘ఇప్పుడు సలాం.. నమస్తేలు చెప్పుకోవడంలోనే ఓ స్టైల్ ఉంది. @పెప్సీ ఇండియా #సోషల్ డిస్టెన్సింగ్ #స్వాగ్ సె సోలో” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక వీడియోలో షేక్ హ్యాండ్ లు వద్దని.. నమస్కారం చెప్పుకోవడమే కొత్త స్టైల్ అని హావభావాలతో ప్రకటించింది. అంటే జనాలు కనపడగానే మీద పడి కుక్కలా కరవకుండా.. లేక దోమను నలిపినట్టు నలిపి పారేయకుండా ఒక్కరే నిలుచుని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి.. సోషల్ డిస్టెన్స్ తో పాటు సైన్సు డిస్టెన్స్ కూడా పాటించండి అని మనం అర్థం చేసుకోవాలేమో.

నిజంగానే ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. పెప్సీ వారు తమ యాడ్ కాంపెయిన్ లో భాగంగా బుట్టబొమ్మ ఈ జాగ్రత్తలు చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ ఓ గంట తర్వాత “ఇన్స్టా హ్యాక్ హోగయా” అనదు కదా!
Please Read Disclaimer