పుష్ప ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు!

0

అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించబడ్డ ‘పుష్ప’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనే విషయంపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అనివార్య కారణాల వల్ల దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న సుకుమార్ చాలా ఫైర్ మీద ఉండి ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాడు. కాని ఆయన ఫైర్ అంతా నీరుగారినట్లయ్యింది. ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేసే పరిస్థితి కనిపించడం లేదు.

శేషాచలం అడవుల నేపథ్యంలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు. కేరళతో పాటు పలు ప్రాంతాల్లో వందల కొద్ది నటీనటులు సాంకేతిక నిపుణులతో చిత్రీకరణకు ప్లాన్ చేశాడు. అల వైకుంఠపురంలో సూపర్ హిట్ అవ్వడంతో బన్నీ ఆ సెలబ్రేషన్స్ లో ఉండటం వల్ల రెండు నెలలు ఆలస్యం అయ్యింది. సరే మార్చిలో అయినా సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్న సమయంలో ఈ విపత్తు వచ్చి పడినది.

సినిమాల షూటింగ్స్ కు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేసిన నేపథ్యంలో పుష్ప చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని పలు ఆంక్షల మద్య తక్కువ మంది నటీనటులతో మరియు సాంకేతిక నిపుణులతో పుష్ప చిత్రంలోని ఏ సన్నివేశాన్ని తీయడం సాధ్యం కాదని అందుకే వెయిట్ చేయాలని సుకుమార్ అండ్ టీం భావిస్తున్నారట. మరికొంత కాలం పరిస్థితితులను గమనించి ఆ తర్వాత షూటింగ్ కు వెళ్లే విషయమై ఆలోచించాలనుకుంటున్నాడట.
Please Read Disclaimer