మహేష్ కు మరో ఆప్షన్ లేనట్లుంది

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ 26 సినిమా పూర్తి కాకుండానే 27వ సినిమా ప్రకటన వస్తుందని అంతా భావించారు. కాని కొన్ని కారణాల వల్ల ఇంకా మహేష్ బాబు 27వ సినిమా అధికారిక ప్రకటన రాలేదు.

మహేష్ బాబు 27వ చిత్రం గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగతో పాటు చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కాని ఆయన మాత్రం తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఎవరు ఖాళీ లేరు. సందీప్ రెడ్డితో చేయాలనుకున్న సినిమా స్క్రిప్ట్ సరిగా రాలేదట. దానికి మార్పులు చేర్పులు చెప్పడంతో సందీప్ కు ఈలోపు బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది.

సందీప్ తో ఇప్పట్లో సినిమా లేదని తేలిపోయిందంటున్నారు. ఇక సుకుమార్ తో సినిమా ఉంటుందో ఉండదో కూడా అర్థం కావడం లేదు. కొరటాలతో మహేష్ కు మరో సినిమా చేయాలని ఉన్నా చిరంజీవికి ఆ తర్వాత మరో మెగా హీరోకు ఆయన కమిట్ అయ్యి ఉన్నాడట. అందుకే మహేష్ బాబుకు మరే దర్శకుడు కూడా అందుబాటులో లేడు. చేస్తే కొత్త వారితో ప్రయోగం చేయాలి. కాని మహేష్ బాబుకు అది ఇష్టం లేదట. అందుకే తనకు మహర్షి వంటి మంచి సినిమాను ఇచ్చిన వంశీకి మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

మహర్షి చిత్రం సమయంలోనే వంశీ ఒక స్టోరీ లైన్ ను మహేష్ బాబుకు వినిపించాడట. అప్పుడే వంశీతో మళ్లీ సినిమా చేస్తానంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. కాని ఆ ప్రాజెక్ట్ మరీ ఇంత స్పీడ్ గా పట్టాలెక్కుతుందని అనుకోలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మహేష్ 27వ సినిమాను వచ్చే వేసవి వరకు పట్టాలెక్కించే అవకాశం ఉందని.. 2021 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఎందుకంటే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ విషయంలో అయినా మేకింగ్ విషయంలో అయినా స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ఉంటారని అందుకే మహేష్ 27వ సినిమాకు సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Please Read Disclaimer