ఇంతకీ పీకే విరూపాక్ష.. పాన్ ఇండియా మూవీనా కాదా..??

0

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పై పనిచేస్తున్నాడు. రాజకీయాల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కాబట్టి తదుపరి సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్.. నెక్స్ట్ క్రిష్ తో చేయనున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఇటీవలే ఫిలింనగర్ చుట్టూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. బందిపోటు లేదా గజదొంగ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపించింది. మరి నామమాత్రంగా విరూపాక్ష అని పిలుచుకుంటున్న ఈ సినిమా టైటిల్ ఏది ఫిక్స్ చేస్తారో అని కాస్త ఆసక్తి నెలకొంది. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాను ఏయం. రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కుతుందట.

క్రిష్ దగ్గరుండి మరీ ఈ సినిమా విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాడట. చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలలో వినికిడి. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే పవన్ నటించనున్న తొలి హిస్టారికల్ చిత్రం కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. మరి అసలు విషయం ఏంటంటే.. హిస్టారికల్ మూవీ కాబట్టి ఈ సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే తెరక్కనుందా.. లేక పాన్ ఇండియా మూవీనా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీని పై దర్శక నిర్మాతలు ఏ సమాధానం ఇవ్వనున్నారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే!