‘ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అంటున్న రేణుదేశాయ్

0

రేణూ దేశాయ్.. అంటే పవర్ స్టార్ మాజీ భార్య మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీ కూడా అనే సంగతి అందరికి తెలిసిందే. ఆమె విడాకుల అనంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం ప్రారంభించింది. ఇక పవన్ తో విడిపోవడం పక్కన పెడితే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం పెద్ద షాక్. ఇక ప్రస్తుతం రేణుదేశాయ్ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందట. తను వర్క్ సంబంధించి ఏదో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తన పిల్లలు ఆద్య.. అకీరా నందన్ గురించి చెప్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఎక్కువగా తన పిల్లల గురించి మాత్రమే పోస్ట్ చేస్తుంది. కొడుకు గురించి తక్కువే కానీ కూతురు గురించి ఎక్కువ. ఇక ఇటీవలే లాక్ డౌన్ సడలింపులు లభించడంతో మళ్లీ ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు వచ్చింది రేణుదేశాయ్.

జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న ఓ ప్రోగ్రాంలో రేణు నటిస్తోంది. ఈ మధ్య షూటింగుతో బిజీ అవుతుందట. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో సమాజంలో జరిగే పరిస్థితుల పై.. జరుగుతున్న సంఘటనల పై కూడా అప్పుడప్పుడు స్పందిస్తుంది. ఇటీవలే ఆమె నెట్టింట షేర్ చేసిన ఓ పిక్ తెగ ఆకట్టుకుంటోంది. మాములుగా సద్గురు అంటే సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు సుపరిచితులే. ఆయన ఆరాధనలో.. ఆయన వివరించే జీవిత సత్యాలను చెవులప్పగించి వింటారు. సద్గురు ఈషా ఫౌండేషన్ గురించి తాజాగా రేణుదేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆమె.. “సద్గురు. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇక్కడ ఉన్నందుకు కేవలం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మోడ్రన్ కల్చర్ను భారతీయ సంస్కృతికి వారధిగా ఆయన సేవలకు ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తిగతంగా కలిసి కలిసి ధన్యవాదాలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆద్య ఫోటోను పోస్ట్ చేసింది. అంతేగాక సద్గురుకు సంబంధించిన ఓ పుస్తకాన్ని కూడా షేర్ చేయడం విశేషం.




Please Read Disclaimer