వాళ్ళకు ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే సత్తా లేదట!

0

ఈమధ్య ఓ చిన్న సినిమాకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఆ ఈవెంటుకు ఒక స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ హాజరయ్యారు. ఈ సమయంలో మీడియం రేంజ్.. చిన్న రేంజ్ హీరోల మార్కెట్ పై చర్చ జరిగింది. ఈ ఆఫ్ లైన్ సంభాషణలో ఆయన పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆయన చెప్పిన వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఒకటికి పదిసార్లు అలోచిస్తున్నారు. పెద్ద స్టార్ హీరోలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలరు కానీ మీడియం.. స్మాల్ రేంజ్ హీరోలలో అతి తక్కువమందికే అలా ఆడియన్స్ ను సినిమా హాల్స్ కు రప్పించగలగే సత్తా ఉందట. వీరిలో సహజ నటుడిగా పేరుతెచ్చుకున్న ఒక హీరో.. ముందు వరసలో ఉంటాడట. ఈమధ్య ఓ హిట్టు సాధించిన మెగా హీరోకు.. మెగా ఫ్యామిలీలో మరి కొందరు మీడియం రేంజ్ హీరోలకు ఆ సత్తా ఉందట. క్రేజీ యువ హీరో గురించి.. ఈమధ్యే ఒక హిట్ సాధించి.. పెళ్ళి ఫిక్స్ చేసుకున్న యువ హీరో గురించి మాట్లాడుతూ ఈ హీరోలు ఇలా మెరిసి అలా మాయమై పోయే బాపతు అని.. నిలకడ లేదని తేల్చేశారు.

ఈ లిస్టులో చివరి బెంచ్ లో ఉన్న హీరోకు పోయినేడాది ఒక హిట్ దక్కింది.. ఈ ఏడాది ఓ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివాహం కూడా ఈమధ్యే ఫిక్స్ అయింది. ఈ హీరోలు తప్ప మిగతా హీరోలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే స్టామినా లేదని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ ఈయన కామెంట్ల పై కొన్ని సెటైర్లు కూడా పడుతున్నాయి.. బ్యానర్ లో ఈమధ్య థియేటర్లకు ప్రేక్షకుల రప్పించలేని హీరోలతో మరి సినిమాలు ఎందుకు చేసినట్టో చెప్పాలని.. పరిస్థితి ఇలా ఉంటే తన కుటుంబం నుంచి ఒక వారసుడిని తీసుకొస్తున్నారని.. ఆ హీరో సంగతి ఏంటి? ఈయన దృష్టిలో వారందరూ అసలు హీరోలే కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాలం పూర్తిగా మారింది. హీరోలు రెండు రకాలు. థియేటర్లకు రప్పించే హీరోలు.. అమెజాన్ నుంచి ఆహల వరకూ ఓటీటీ లతో సరిపెట్టుకునే హీరోలు!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-