తిప్పరా మీసం పోస్టర్ టాక్

0

యూత్ హీరోలంతా ప్రేమ కథల వెంటపడుతున్నా తనకంటూ ఓ వైవిధ్యమైన శైలిని ఏర్పర్చుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం తిప్పరా మీసం. అసుర ఫేమ్ ఎల్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. త్వరలోనే టీజర్ ని విడుదల చేయబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్.

తల నిండా గుబురుగా పెరిగిన జుట్టుని అల్ట్రా మాడరన్ స్టైల్ లో తీర్చిదిద్దుకుని బారెడు గెడ్డం మీసాలతో శ్రీవిష్ణు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇదో న్యూ ఏజ్ రివెంజ్ థ్రిల్లర్ గా కొత్త తరహాలో ఉంటుందని తెలిసింది ఇటీవలే బ్రోచెవారెవరుగాతో డీసెంట్ హిట్ కొట్టిన శ్రీవిష్ణు దీని మీద కూడా గట్టి నమ్మకంతో ఉన్నాడు.

నీది నాది ఒకే కథ ఫేం సురేష్ బొబ్బిలి దీనికి సంగీతం అందిస్తున్నాడు. తిప్పరా మీసం టైటిల్ ని బట్టి మాస్ కు కూడా గట్టిగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. వాస్తవానికి యూత్ కి ఒకవర్గం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే దగ్గరగా ఉన్న శ్రీవిష్ణు ఈసారి మాస్ ని టార్గెట్ చేశాడు. అందుకే తెలుగువాడు పౌరుషానికి ప్రతీకగా భావించే మీసాన్ని కాన్సెప్ట్ గా తీసుకున్నాడు. అసలు హీరో మీసం ఎందుకు తిప్పల్సి వచ్చిందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Please Read Disclaimer