ఈ హీరోయిన్ చాలామందితో ప్రేమలో పడిందట

0

బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మీడియాలో ఉంటూ ఉండే రాధిక ఆప్టే తాజాగా నేహా దుపియా టాక్ షోలో హీరో ఆయుష్మాన్ తో కలిసి పాల్గొంది. ఈ సందర్బంగా పలు విషయాలను రాధిక ఆప్టే ప్రేక్షకుల ముందు ఉంచింది. రాధిక ఆప్టే నుండి పలు విషయాలను నేహా దుపియా రాబట్టింది. విక్కీ డోనర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా బీర్లు ఎక్కువ తాగడంతో లావు అయ్యానని.. దాంతో ఆ చిత్రం నుండి తొలగించారంటూ రాధిక చెప్పిన విషయం తెల్సిందే. అదే టాక్ షో లో రాధిక ఆప్టేను ప్రేమ విషయమై నేహా దుపియా ప్రశ్నించింది.

షూటింగ్ సమయంలో ఇతరత్ర సందర్బాల్లో నాకు ఎదురైన వ్యక్తులు నా దృష్టిని ఆకర్షించారు. అందులో కొంత మంది నా మనసుకు నచ్చిన వారు కూడా ఉన్నారు. వారితో ప్రేమలో కూడా పడ్డానంటూ చెప్పుకొచ్చింది. ఎదుటి వారితో నటిస్తున్న సందర్బంలో డాన్స్ చేస్తున్న సందర్బంలో వారు నాకు నచ్చడంతో వారిని ప్రేమించానంటూ నిర్మొహమాటంగా చెప్పింది. ఆ సమయంలో తనకు తానే ‘ఓమైగాడ్.. ఏం జరుగుతుంది’ అనుకునేదాన్ని.

ఇక రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో టెంమ్ట్ అయిన సందర్బాలున్నాయా అంటూ నేహా దుపియా ప్రశ్నించగా.. అఫ్ కోర్స్ ఖచ్చితంగా అలాంటి సంఘటనలు నా సినీ కెరీర్ లో ఉన్నాయి. అలా టెంమ్ట్ అయితేనే సీన్ బాగా పండుతుందనేది నా అభిప్రాయం. నటనలో అలాంటివి అన్ని కామన్ అని తేలికగా తీసుకోలేమంది.

బెనెడిక్ట్ టేలర్ లాంటి వ్యక్తి నాకు భర్తగా లభించడం నా అదృష్టం. నాకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడు. ఇద్దరం ఎవరి కెరీర్ లో వాళ్లం బిజీగా ఉన్నాం. అయినా కూడా మా వైవాహిక జీవితంకు ఎలాంటి ఇబ్బందులు లేదంటూ రాధిక పేర్కొంది.