ఒక్క దెబ్బకు ముగ్గురి డిమాండ్ పెరిగింది

0

ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కడ చూసినా కబీర్ సింగ్ గురించిన చర్చే జరుగుతోంది. సల్మాన్ ఖాన్ అంతటి టాప్ స్టారే తన భారత్ ను పట్టుమని రెండు వారాలు స్టడీగా నిలపడానికి నానా కష్టాలు పడితే మీడియం రేంజ్ కి ఓ మెట్టు కిందే ఉండే షాహిద్ కపూర్ సినిమా ఏకంగా 300 కోట్లను టార్గెట్ చేసి మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటం అంటే మాటలా. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా. వివాదాలు దాని మీద డిస్కషన్లు ఇవన్నీ పక్కనపెడితే షాహిద్ కపూర్ మార్కెట్ ని అమాంతం పెంచడంలో మాత్రం ఇతని పాత్రే కీలకంగా నిలుస్తోంది.

కబీర్ సింగ్ దెబ్బకు షాహిద్ కపూర్ తన రెమ్యునరేషన్ ఏకంగా 35 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని ముంబై మీడియాలో పెద్ద టాకే నడుస్తోంది. మొన్నటిదాకా ఇది షాహిద్ కలలో కూడా ఊహించని మొత్తం . ఇంత డిమాండ్ వస్తుందని అసలు అనుకున్నాడో లేదో. తనే కాదు కబీర్ సింగ్ దెబ్బకు కియారా అద్వానీ రేంజ్ మాములుగా పెరగలేదు. కెరీర్ పరంగా గుర్తింపు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం స్టార్ల సరసన చేరిపోయింది. తన పారితోషికం ఎంతనే లీక్ బయటికి రాలేదు కానీ ఫిగర్స్ మాత్రం షాకింగ్ గానే ఉన్నాయట.

వీళ్ళకే ఇలా ఉంటే సృష్టికర్త సందీప్ వంగా పరిస్థితి వేరే చెప్పాలా. సల్మాన్ ఖాన్ నుంచే పిలుపు వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి చేరుకున్నాడో. కానీ సందీప్ వంగా తన నెక్స్ట్ మూవీ మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి ఒక్క దెబ్బతో మూడు పిట్టలు అన్న సామెతను నిజం చేస్తూ సందీప్ వంగా తనతో పాటు షాహిద్ కపూర్ కియారా అద్వానీల రేంజ్ ని అమాంతం పెంచేసి కబీర్ సింగా మజాకా అనిపించేశాడు. మూడు వందల కోట్ల టార్గెట్ ను అతి త్వరలోనే రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
Please Read Disclaimer