బ్రహ్మానందంలోని మంచి కోణం ఇదే..

0

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల కన్నప్రేమ గురించి కథలు కథలుగా చెబుతారు. బెల్లంకొండ శ్రీనును ఇండస్ట్రీలో నిలబెట్టడానికి ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ కోట్లు ఖర్చు పెడుతూ సినిమాలు తీస్తూ వారసుడిని ఘనంగా చాటుతున్నారు. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికీ తన ఇద్దరు కొడుకుల కోసం స్వయంగా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తూ కొడుకుల కోసం పాటుపడుతున్నారు. ఇక అల్లు అరవింద్ గురించి చెప్పక్కర్లేదు. గీతా ఆర్ట్స్ పై కొడుకులు అల్లు అర్జున్ శిరీష్ లను హీరోలుగా పెట్టి బోలెడు డబ్బు ఖర్చు పెడుతున్నారు.

అయితే వీరంతా కొడుకుల భవిష్యత్ కోసం డబ్బును తృణప్రాయంగా ఖర్చు పెడుతుంటే టాలీవుడ్ నంబర్ 1 కమెడియన్ అయిన బ్రాహ్మానందం మాత్రం తన కుమారుల సినీ కెరీర్ విషయంలో పైసా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరే వార్త తాజాగా సినిమా ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. వేరే ఇతర రంగాల్లో కొడుకులను నిలబెట్టడానికి ఎంతైనా ఖర్చు పెడుతానని.. సినిమాలపై మాత్రం పెట్టనని బ్రహ్మీ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాల కోసం ఖర్చు పెట్టడానికి బహ్మానందం వెనుకాడుతుంటారని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు.

అయితే బ్రహ్మానందం దగ్గర డబ్బు లేక.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా సినిమాలపై ఖర్చు పెట్టరు అనుకుంటే పొరపాటే.. ఎన్నో ఏళ్ల నుంచి కమెడియన్ గా బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీని ఆవపోసన పట్టాడు. 1990వ దశాబ్ధం నుంచే టాలీవుడ్ నంబర్ 1 కమెడియన్ గా ఉన్నారు. ఆయన ఒక్కో రోజుకు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రూ.7 లక్షల వరకు తీసుకునేవారని ఇండస్ట్రీలో చెప్పుకొంటారు. ఆ సంపాదన అంతా రియల్ ఎస్టేట్ లో ఇతర మార్గాల్లో పెట్టారని సన్నిహితులు చెబుతుంటారు.. వాటితో తను తన కొడుకులు సంతోషంగా ఉంటున్నారు. అయితే కొడుకులు సినిమాల్లోకి వెళితే వారిని నిలబెట్టడానికి మాత్రం పెట్టుబడికి బ్రహ్మానందం నో చెబుతుంటారట..

బ్రహ్మానందం తన కొడుకులు గౌతమ్ సిద్ధార్థ్ లపై పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి అస్సలు ఇష్టపడరనే టాక్ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. టాలీవుడ్ లో సినిమాలు నిర్మాణం జూదంతో సమానమని బ్రహ్మీ నమ్ముతాడట.. డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డున పడ్డ ఎంతో మంది నిర్మాతలను ప్రముఖులను దగ్గరి నుంచే చూశాకే ఇలా బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టవద్దని డిసైడ్ అయ్యారని చెబుతుంటారు. సినిమాల్లో పెడితే మునగడమే కానీ.. తేలడం ఉండదని బ్రహ్మీ బలంగా నమ్ముతారట.. అందుకే సంపాదించిన సొమ్మును సినిమాలకు ఖర్చు పెట్టనని బ్రహ్మీ నిర్ణయించుకున్నాడట.. బ్రహ్మీ పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా చిన్నకొడుకు దర్శకత్వంవైపు అడుగులు వేస్తున్నా వారికి ఆర్థిక భరోసాను కల్పించడం లేదట.. తన సంపాదనను తనివి తీర అనుభవించండని కొడుకులకు చెబుతుంటారట.. కానీ సినిమాల్లో మాత్రం ఈ డబ్బును పెట్టవద్దని ఖరాఖండీగా చెబుతుంటాడట.. సినిమాల్లోనే ఎదిగిన బ్రహ్మానందంకు సినిమాలపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడకపోవడం వెనుక ఇదే కారణమని ఆయన సన్నిహితులు చెబుతుంటారట..Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home