రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ లుక్ ఇదే

0

ఎంచుకున్న పాత్రకు తగ్గట్టు ఆహార్యం.. డ్రెస్సింగ్ సెన్స్ సెటప్ ఉంటుంది. స్టూడెంట్.. ఫ్యాక్షనిస్ట్.. ప్రేమికుడు.. పోలీస్..యముడు.. అభినవ రావణుడు.. ఇలా పాత్ర వైవిధ్యాన్ని బట్టి ఆహార్యాన్ని మార్చేయడంలో ఎన్టీఆర్ సక్సెస్ రేటు గురించి చెప్పాల్సిన పనే లేదు. పాత్ర ఏదైనా అందులో జీవించడం పరకాయ ప్రవేశం చేయడం యంగ్ యమకి తెలిసినంతగా వేరొకరికి తెలీదేమో! అందుకే ఇంతగా అశేషమైన ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ముఖ్యంగా మాస్ లో తారక్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.అలాంటి ట్యాలెంటెడ్ హీరో త్రివిక్రమ్ లాంటి క్లాసిక్ డైరెక్టర్ చేతిలో పడితే ఎలా ఉంటుందో `అరవింద సమేత` మూవీ ద్వారా అభిమాన లోకానికి తెలిసింది. శాంతం.. ఉగ్రం.. రెండు లక్షణాలు కలగలిసిన పాత్రలో తారక్ అసాధారణ నటప్రతిభ మైమరిపింపజేసింది. మరోసారి త్రివిక్రమ్ తో కలిసి తారక్ ప్రయోగమే చేస్తున్నాడు. ఈసారి అతడు ఎలా కనిపించబోతున్నాడు? అన్నదానికి ఇప్పటికే క్లూ ఉంది. యంగ్ యమ ఎన్టీఆర్ ని ఈసారి మాటల మాంత్రికుడు పూర్తి వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. అది కూడా ఖద్దరు తొడిగిన రాజకీయ నాయకుడిగా అతడిని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం తారక్ పై లుక్ టెస్ట్ సాగుతోంది. వైట్ అండ్ వైట్ ఖద్దర్ చొక్కాలో అతడిని చూస్తుంటే అభినవ రాజకీయ నాయకుడినే తలపిస్తున్నాడని తాజాగా లీకైన ఫోటో చెబుతోంది. కొవిడ్ మార్గదర్శకాల్ని అనుసరించి పరిమిత సిబ్బంధితో త్రివిక్రమ్ లుక్ టెస్ట్ పూర్తి చేశారట. తాజా లుక్ చూసిన తర్వాత అభిమానుల్లో ఎవరికి వారు ఇమాజినేషన్ లోకి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో తారక్ అనూహ్యంగా రంగ ప్రవేశం చేస్తే ఇలాంటి గెటప్ ని ఫాలో చేస్తాడా? అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడేసుకోవడం ఇంట్రెస్టింగ్. జైలవకుశలో రావణుడిగా విలక్షణమైన పాత్రలో కనిపించిన తారక్ ఒక రాజకీయ నాయకుడిగా అవకాశం ఇస్తే అంతకుమించి చెలరేగుతాడనే అంచనా వేస్తున్నారు. అయితే రావణాసుర లక్షణాలుండే నాయకుడా? మంచి నాయకుడా? అన్నది కాస్త ఆగితే కానీ క్లూ దొరకదు.

ఇకపోతే త్రివిక్రమ్ .. కథ- స్క్రిప్టు రెడీ చేసి ప్రీప్రొడక్షన్ కానిచ్చేస్తున్నారు. లుక్ టెస్ట్ పూర్తి చేసారు కాబట్టి ఇక సెట్స్ కెళ్లడమే తరువాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెండింగ్ షూట్ పూర్తి చేస్తే త్రివిక్రమ్ తో సెట్స్ లో జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Please Read Disclaimer