అల్లూ హీరోపై ఫ్లెక్సీ వెనక టాప్ సీక్రెట్

0

ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై నింద వేస్తూ.. ఓ ప్లెక్సీ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. బన్ని సినీ పరిశ్రమ కార్మికులు పొట్ట కొడుతున్నాడని! అతను ఎందుకిలా చేస్తున్నాడని సినీ కార్మిక వర్గానికి చెందిన కొందరు అక్కసుతో ఈ పని చేసారు. దీంతో బన్నీ పైనే వాళ్లకు ఎందుకు అంత కక్ష? మరీ పబ్లిగ్గా ఇలా ప్లెక్సీ పెట్టి నెగిటివ్ ప్రచారం చేయడం వెనుక కారణమమిటి? అంటూ చర్చ సాగింది. బన్ని సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆ దుండగులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసారట. తాజాగా ఈ వ్యవహారానికి కారణం తెలిసింది. చేసింది ఎవరో కూడా తెలిసిపోయింది. ఇది `అల వైకుంఠపురములో` ఆన్ లొకేషన్ మనస్ఫర్థలకు సంబంధించిన వ్యవహారం అని తెలుస్తోంది.

ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన `రాములో రాముల..` పాట ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముంబై నుంచి ప్రత్యేకంగా డాన్సర్లను తీసుకొచ్చాడట. తెలుగు డాన్సర్ల ను పక్కనబెట్టి ఇలా ముంబై డ్యాన్సర్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడుట. పాట షూట్ లో భాగంగా ముంబై డాన్సర్లను ముందు వరుస లో పెట్టి.. ఆ వనెనకగా తెలుగు డాన్సర్లను పెట్టి షూటింగ్ పూర్తి చేసారుట. దీంతో టాలీవుడ్ డాన్సర్లు బాగా హర్ట్ అయ్యారట. తమకు ప్రాధాన్యత తగ్గించడంపై గుర్రుమన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బన్ని తెలుసుకున్నారట. అటుపై ముంబై డాన్సర్లకు.. మన వాళ్లకి ఉన్న తేడా చూసారా? అని మన డ్యాన్సర్లకు చిన్న క్లాస్ తీసుకున్నాడుట.

దీంతో మరింత బాధపడిన తెలుగు డాన్సర్లే ఆ ప్లెక్సీని బన్నీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసారని తెలుస్తోంది. ఈ విషయం బన్నీ కి తెలియడంతో సదరు డాన్సర్లను పిలిపించింది ప్రశ్నించినట్లు సమాచారం. ఇద్దరి మధ్య వ్యత్సాసాన్నే చెప్పాను తప్ప! ఎవరిని తక్కువ చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడుట. ఇక్కడ ట్యాలెంట్ మాత్రమే నడిపిస్తుందని..అందుకోసం నిరంతరం కష్టపడండని సూచించాడుట. అదీ ఆ ప్లెక్సీ కథ. అయితే ఇది ఈగో క్లాస్ కు సంబంధించినది. ప్రతిభకు సంబంధించిన సమస్య. బన్ని ప్రతిభను అన్నివేళలా ప్రోత్సహిస్తారు. అణచిపెట్టరని చాలాసార్లు ప్రూవైంది. ఇది తాత్కాలిక సమస్య అని భావించవచ్చు.
Please Read Disclaimer