ఒక్కో పుంజు ఒక్కోరోజు కత్తి కట్టేలా

0

సంక్రాంతి పందెం జోరు గురించి చెప్పాల్సిన పనేలేదు. 2020 సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల నడుమ ఊహించని కాంపిటీషన్ నెలకొంది. ఇక రిలీజ్ తేదీల విషయమై ఓ రెండు భారీ చిత్రాల నిర్మాతల మధ్య చిన్నపాటి వార్ సాగడంపై ఇటీవల ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరూ నువ్వా నేనా? అంటూ ఒకేరోజు రిలీజ్ తేదీని ఫిక్స్ చేయడంతో అసలేమైంది! అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏ సినిమాలు అంటే చెప్పాల్సిన పనేలేదు. మహేష్-సరిలేరు నీకెవ్వరు.. బన్ని-అల వైకుంఠపురములో చిత్రాల గురించే ఇదంతా.

ఒకరు ప్రకటించారని ఇంకొకరు అన్నట్టుగా ఒకేరోజు రిలీజ్ కి రెడీ అవ్వడంతో ఏదో అన్ వాంటెడ్ వార్ నడుస్తోందని భావించాల్సి వచ్చింది. అయితే మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్! అనకుండా ఆ ఇద్దరూ ఇప్పుడు మాట్లాడుకుని ఒకేరోజు రాకుండా జాగ్రత్త పడ్డారట. జనవరి 11న `సరిలేరు నీకెవ్వరు` రిలీజవుతుంటే.. జనవరి 12న `అల వైకుంఠపురములో `చిత్రం రిలీజయ్యేలా ప్లాన్ డిజైన్ చేశారట. ఆ మేరకు అనీల్ సుంకర- దిల్ రాజు బృందం.. అల్లు అరవింద్-ఎస్. రాధాకృష్ణ బృందం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట. ఆ మేరకు ఇరువురి మధ్యా అంగీకారం కుదిరిందని సన్నిహిత వర్గాల ద్వారా వెల్లడైంది.

ఇలా చేస్తే ఆ ఇద్దరికీ కలిసొచ్చేదే. ప్రీమియర్ కలెక్షన్లకు ఒకేరోజు పోటీ లేనట్టే. ఓపెనింగులకు ఇది ప్లస్ అవుతుంది. ఇది ఇటు తెలుగు రాష్ట్రాల వరకే కాకుండా అటు ఓవర్సీస్ ప్రీమియర్లకు.. అక్కడ ఓపెనింగులకు పెద్ద ప్లస్ అవుతుంది. ఓపెనింగ్ డే రికార్డులకు కలిసొస్తుంది. పండగ సెలవులు ఈ రెండిటికి పెద్ద ప్లస్ కానున్నాయి. అయితే వార్ లో ఎవరికి పాజిటివ్ టాక్ వినిపిస్తే వాళ్లదే పై చేయి అవుతుంది. కంటెంట్ పరంగా ఎవరు బెస్ట్ అయితే వాళ్లనే సంక్రాంతి పందెంలో విజయం వరిస్తుంది. సరిలేరుకి అనీల్ రావిపూడి.. అల వైకుంఠపురములో చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
Please Read Disclaimer