వావ్.. బైకును కారులా మార్చేసిన కుర్రాళ్లు, దీన్ని చూస్తే మీరూ ఫిదా అవుతారు!

0

న ఇండియాలో టాలెంట్‌కు కొదవే లేదు. సోషల్ మీడియా దయవల్ల ఎక్కడెక్కడో ఉన్న సృజనాత్మక వ్యక్తులు ఈ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తమ అద్భుతమైన ఆవిష్కరణలు, ఐడియాలతో ఆకట్టుకుంటున్నారు. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఈ కుర్రాళ్లు కూడా ఆ కోవలోకే వస్తారు.

సాధారణ బైకును కారులా మార్చేసిన ఈ కుర్రాళ్లు రోడ్లపై షికారు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరస్తున్నారు. @desimojito అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన ఈ బైక్ కారు వీడియోను చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. వారి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారులో సగం భాగం మాత్రమే పూర్తయ్యింది. ఇంకా వెనుక భాగం, టాప్ తయారు చేయాల్సి ఉంది. దీపావళి తర్వాత ఈ కారును పూర్తి చేస్తామని ఈ వీడియోలో తెలిపారు. బైకు హ్యాండిల్‌ను పూర్తిగా స్టీరింగ్‌లా మార్చేశారు. కారు తరహాలోనే బ్రేకులు, ఎస్కలేటర్, గేర్లు ఏర్పాటు చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

వీడియో:Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home