ప్రసిద్ధ మోడల్ చెప్పిన విషయం.. అంతా షాక్

0

దేశంలోనే ప్రఖ్యాత మోడల్ గా మిలింద్ సోమన్ కు పేరుంది. అతడు ఎంతో మందికి స్ఫూర్తి. చాలా మంది ఫాలోవర్స్ అతడికి ఉన్నారు. అయితే తాజాగా అందరికీ షాకిస్తూ మిలింద్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. అతను తన ఆత్మకథలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా పేర్కొనడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇతడిని ఫాలో అవుతున్న లక్షలాది మంది “ఉదారవాద” అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.. ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ప్రచారాలన్నింటికీ తాను అడ్డుపడ్డానని చిన్నపిల్లలు ఆర్ఎస్ఎస్కు వెళ్లడం మంచి విషయమని మిలింద్ సోమన్ పేర్కొనడం విశేషం.

మిలింద్ సోమన్ తాను ఆర్ఎస్ఎస్ వాదిగా పేర్కొనడంతో అతడిని అనుసరిస్తున్న చాలా మంది “ఉదారవాదులు” గందరగోళానికి గురయ్యారు. మిలియన్ల మంది హృదయాలను కదిలించిన సూపర్ మేల్ మోడల్ మిలింద్ సోమన్ ఇలా చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.

మిలింద్ సోమన్ గొప్ప రూపానికి అద్భుతమైన శరీరానికి .. అతడి ఫిట్ నెస్ మేనియాకు ప్రసిద్ది చెందారు. అతను యువత ప్రజలను చైతన్యం చేసేలా పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. అస్సామీ అమ్మాయి అంకితా కొన్వర్ తో అతని వివాహం అయ్యింది.

పేరొందిన ఈ మోడల్ తన బాల్యంలో ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధం బహిరంగంగా చెప్పడంతో అతివాదులు ఆయనపై దాడి మొదలు పెట్టారు. తన రాబోయే పుస్తకం కోసం ప్రచారం కోసమే మిలింద్ ఇలా వివాదం రాజేశాడని కొందరు ఆరోపిస్తున్నారు. మరి ఆ పుస్తకంలో ఎలాంటి విషయాలు బయట పడతేడో చూద్దాం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-