ఈ సారి చిరు ఫ్లాప్ టైటిల్ తో

0

కొందరు స్టార్స్ కి కొన్ని సెంటిమెంట్స్ భలే కలిసొస్తాయి. కొందరు అనుకొని ఏదైనా సెంటిమెంట్ ఫాలో అయితే మరి కొందరు అనుకోకుండా ఆ సెంటిమెంట్ తో వస్తారు. అయితే లేటెస్ట్ గా కార్తి సినిమాకు ఇలాగే అనుకోని ఓ లక్కీ సెంటిమెంట్ కలిసొచ్చింది.

మెగాస్టార్ బ్లాక్ బస్టర్ టైటిల్ ‘ఖైదీ’ ను తన సినిమా కు పెట్టుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే కంటెంట్ పరంగా అందరినీ ఆకట్టు కొని ఆ సినిమా సూపర్ హిట్టైంది. అయితే ఎంతో కొంత టైటిల్ సెంటిమెంట్ కూడా కార్తీకి వర్కౌట్ అయింది. ఈ విషయాన్ని తనే స్వయం గా ఒప్పుకున్నాడు.

అయితే మొన్న చిరుకి కలిసొచ్చిన టైటిల్ తో వచ్చిన కార్తి ఇప్పుడు చిరు కెరీర్ లో ప్లాప్ గా నిలిచిన సినిమా టైటిల్ ను పెట్టుకున్నాడు. అవును వదిన జ్యోతిక తో కలిసి కార్తి నటించిన తమిళ సినిమా కు తెలుగులో ‘దొంగ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే చిరంజీవి – కోదండ రామిరెడ్డి కాంబో లో వచ్చిన సినిమాల్లో దొంగ ఫ్లాప్ గా నిలిచింది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ తో ఈసారి కార్తి హిట్ అందుకుంటాడా చూడాలి.
Please Read Disclaimer