తోలుబొమ్మలాట ట్రైలర్ టాక్

0

రాజేంద్ర ప్రసాద్.. విశ్వాంత్ దుడ్డంపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుమదుర్గ క్రియేషన్స్ బ్యానర్ పై మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలయింది.

ట్రైలర్ ఆరంభంలోనే రాజేంద్ర ప్రసాద్ “నా పేరు సోమరాజు. ఈ ఊర్లో వెధవలంతా నన్ను సోడాల రాజు అంటారు. ఇక్కడ ఉన్న సందడికి కారణం తెలుసుకోవాలంటే నేను పది రోజుల క్రితం ఆడించిన తోలుబొమ్మలాట గురించి తెలుసుకోవాలి” అని ఇంట్రో ఇస్తారు. ఆ నలుగురు స్టైల్ లో ఒక ఆత్మ చెప్పే కుటుంబ కథలా ఉంది. ఈ ఆత్మకు మరో ఫన్నీ ఆత్మ తోడు.. ఆయనే వెన్నెల కిషోర్. బావ మరదళ్ళు అయిన సోమరాజు మనవడు.. మనవరాలు ప్రేమలో పడతారు. అయితే సోమరాజు సంతానం.. హీరో హీరోయిన్లకు తల్లి దండ్రులు ఆ పెళ్ళికి ఒప్పుకోరు. వారిని ఒప్పించేందుకు తాత సోమరాజు గారి సహాయం తీసుకుంటారు. మరి ముదురు పార్టీలు అయిన ఆ పేరెంట్స్ ను మంచి మనిషి సోమరాజు ఒప్పించగలిగారా.. లేదా అన్నది కథ. ఓన్లీ ఎమోషన్స్ కాకుండా కాస్త కామెడీ టచ్ కూడా ఉంది. పేరెంట్స్ ను ఆ పెళ్ళికి ఒప్పించే ప్రయత్నాల్లో విసుగొచ్చి వెన్నెల కిషోర్ “వాళ్లను కలిపేకన్నా ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ముందు పచార్లు కొట్టడం బెటర్” అంటూ ఆ పేరెంట్స్ ఎంత మెంటల్ గా ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ కు చెప్తాడు.

ఓవరాల్ గా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ మెసేజ్ అనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమా థీమ్ కు తగ్గట్టుగా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ‘ఆ నలుగురు’ మనసులో మెదలకుండా ఉండదు. ఆలస్యం ఎందుకు.. ‘తోలుబొమ్మలాట’ ట్రైలర్ ను చూసేయండి.
Please Read Disclaimer