నటకిరీటి మరో ‘ఆ నలుగురు’?

0

రాజేంద్ర ప్రసాద్ సినీ కెరీర్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. అందులో ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ‘ఆ నలుగురు’ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఒక మద్య వయస్కుడి పాత్రలో ఆ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కనబర్చిన నటన చాలా బాగుంటుంది. ఆ పాత్ర తరహాలోనే మరోసారి రాజేంద్ర ప్రసాద్ ‘తోలు బొమ్మలాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఆనలుగురు సినిమా తరహాలోనే ఈ చిత్రంలో కూడా మానవ సంబంధాలు.. ఆర్థిక పరమైన విషయాల మేళ్లవింపుతో ఉండబోతుందని తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ తో అర్థం అవుతుంది.

‘తోలు బొమ్మలాట’ చిత్రం మోషన్ పోస్టర్ లోనే సినిమా ఏంటో చెప్పకనే చెప్పారు. బలమైన డైలాగ్స్.. ఆకట్టుకునే పాత్రలతో దర్శకుడు విశ్వనాద్ మాగంటి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో సోమరాజు అలియాస్ సోడాల్రాజు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ మరియు పాత్ర తీరును బట్టి చూస్తుంటే తప్పకుండా మరోసారి రాజేంద్ర ప్రసాద్ విమర్శకుల ప్రశంసలు అందుకోబోతున్నట్లుగా అనిపిస్తుంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. గ్రామీణ వాతావరణంలో చాలా సహజంగా పాత్రలను తీర్చి దిద్దుతున్నట్లుగా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈ చిత్రంలో వెన్నెల కిషోర్.. విశ్వంత్.. హర్షిత.. ఇంకా పలువురు ముఖ్య నటీనటులు ఉన్నారు. ఈ సినిమా ఎమోషన్స్ మాత్రమే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Please Read Disclaimer