పారితోషికాలు త్యాగం చేశారా?

0

మామ-అల్లుడు కథలో బోలెడన్ని ట్విస్టులు కనిపిస్తున్నాయ్. బడ్జెట్లో ట్విస్టులు.. బిజినెస్ లో ట్విస్టులు.. రిలీజ్ తేదీ విషయంలో ట్విస్టులు.. మును ముందు ఊహించని ట్విస్టులెన్నో. తాజాగా పారితోషికాలకు సంబంధించిన ట్విస్టు ఒకటి బయటపడింది.

విక్టరీ వెంకటేష్- యువసామ్రాట్ నాగచైతన్య కథానాయలుగా నటిస్తోన్న వెంకీమామ ఈ డిసెంబర్ లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వాస్తవానికి డిసెంబర్ రిలీజ్ అని .. సంక్రాంతి రిలీజ్ అని మామ కన్ఫ్యూజన్ వెంటాడుతోంది. ఇక ఈ సినిమా కోసం మామ- అల్లుడు ఇద్దరూ అతి తక్కువ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ మామను నిర్మిస్తోంది డి. సురేష్ కాబట్టి వెంకటేష్ సినిమా విజయం సాధిస్తే అందులో వాటా తీసుకునే అవకాశం ఉందట. బయట బ్యానర్లలో అయితే వెంకీ ఒక్కో సినిమాకు 5 కోట్లు ఛార్జ్ చేస్తారు. కానీ వెంకీ మామ కోసం మాత్రం రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదుట. రిలీజ్ తర్వాత చూసుకుందాం అన్నారుట. ఎలాగూ సురేష్ బాబు సొంత అన్నయ్యే కాబట్టి తమ్ముడికి లోటేం ఉండదు.

ఇక మేనల్లుడు నాగచైతన్య బయట బ్యానర్లో ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటాడు. కానీ వెంకీమామకు కేవలం కొటిన్నర మాత్రమే అడ్వాన్స్ గా అందుకున్నాడట. అదీ సురేష్ బాబు అతి బలవంతం చేస్తే తీసుకున్నట్లు చెబుతున్నారు. మామ సినిమా కావడంతో షూటింగ్ కోసం ఎక్కువ కాల్షీట్లు కేటాయించాడు. మధ్యలో మరో సినిమా ప్రారంభించాలని ఇతర నిర్మాతలు తొందరపెట్టినా వెంకీ మాను పూర్తిచేసే వరకూ ఏదీ కమిటవ్వలేదు.

నాగచైతన్య కు సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఒకవేళ సినిమా విజయం సాధిస్తే గనుక సొంత మామే కాబట్టి వచ్చిన లాభాల్లో పర్సంటేజీ ఇచ్చే ఛాన్సుందట. ఏదేమైనా సొంత ఫ్యామిలీలోనే హీరోలుంటే నిర్మాణం పరంగా కొన్ని వెసులుబాట్లు కుదురుతాయని ఈ మామా అల్లుళ్ల వ్యవహారం తేల్చి చెబుతోంది.
Please Read Disclaimer