నామినేషన్లోకి మళ్ళీ ఆ ముగ్గురు వితికా సేఫ్

0

బిగ్ బాస్ షో 11 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 12 వారంలోకి అడుగుపెట్టింది. 11వ వారం ఎలిమినేషన్లో పునర్నవి అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఇక 12 వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్లో జరిగింది. ఈ నామినేషన్ లో భాగంగా ఇంటిలో ఉన్న 8 మంది సభ్యులకు 8 ట్రాలీలు ఇచ్చారు. అలాగే 7 పార్కింగ్ లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ నాలుగు రౌండ్లు జరిగింది. బజర్ మ్రోగేసరికి ట్రాలీ పార్కింగ్ చేసిన వారు సేఫ్ అవుతారు. పార్కింగ్ చేయని వారు నేరుగా నామినేట్ అవుతారు.

అయితే మొదట బజర్ మ్రోగగానే వరుణ్ ట్రాలీ పార్కింగ్ చేయలేక నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ మిగిలిన 7 గురు సభ్యులకు 6 పార్కింగ్ లైన్స్ ఇచ్చారు. ఇక రెండో బజర్ మ్రోగగానే వితికా తప్ప మిగతా వారు పార్కింగ్ చేయడంతో ఆమె నామినేట్ అయింది. తొలి రెండు ప్రయత్నాల్లోనే భార్య భర్తలు అయిన వితిక వరుణ్ ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత మూడో రౌండ్ లో మహేశ్ – రాహుల్ ఒకేసారి పార్కింగ్‌లోకి వెళ్లారు. ఎవరికి వారు తామే ముందు వెళ్లామని చెప్పగా చివరకు బిగ్‌బాస్ ముందుగా పార్కింగ్ జోన్లోకి వెళ్లిన రాహుల్‌ను సేవ్ చేసి… మహేశ్‌ను ఎలిమినేట్ చేశాడు.

ఇక నాలుగో రౌండ్ లో రాహుల్ నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం వరుణ్ వితికా మహేశ్ రాహుల్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లారు. అయితే వితికా దగ్గర మెడాలియన్ ఉండటంతో అది ఉపయోగించుకోవడంతో ఆమె నామినేషన్ నుంచి తప్పుకుంది. వితికా సేఫ్ అవ్వడంతో వరుణ్ రాహుల్ మహేశ్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. గత వారం కూడా ఈ ముగ్గురు ఈ ఎలిమినేషన్ జోన్లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు కూడా మళ్లీ ఈ ముగ్గురే ఎలిమినేషన్ జోన్లోకి రావడం విశేషం. గత వారం పునర్నవికు అందరికంటే తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యి ఈ ముగ్గురు సేఫ్ అయ్యారు. కానీ ఈ వారం వీరిలో హౌస్ నుంచి బయటకు వెళతారో చూడాలి. ఇక దసరా సందర్భంగా కింగ్ నాగార్జున మంగళవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
Please Read Disclaimer