ఆ రెండు సినిమాలు దేవీకి లిట్మస్ టెస్ట్

0

తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కొద్దిరోజుల క్రితం వరకూ తప్పనిసరిగా దేవీ శ్రీ ప్రసాద్ పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా అలా జవాబు చెప్పాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ‘రంగస్థలం’ తర్వాత దేవీ సంగీతం అందించిన ఏ సినిమా కూడా మొత్తం ఆల్బమ్ హిట్ కాలేదు. దీంతో చాలామంది స్టార్ డైరెక్టర్లు.. స్టార్ హీరోలు దేవీకి బదులుగా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటున్నారు.

ప్రస్తుతం డీఎస్పీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం రెండే. అందులో ఒకటి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’. రెండోది అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #AA20. మహేష్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇంకా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. ఈ సినిమా మ్యూజిక్ ఇప్పుడు దేవీకి ఫస్ట్ లిట్మస్ టెస్ట్ కానుంది. ఎందుకంటే ఈ సినిమాతో పోటీలో ఉన్న అల్లుఅర్జున్ సినిమా ‘అల వైకుంఠపురములో’ నుండి ఇప్పటికే రెండు సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. థమన్ ట్యూన్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా మారాయి. దీంతో సరిలేరు ‘నీకెవ్వరు’ సినిమా సాంగ్స్ ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక #AA20 మ్యూజిక్ కూడా మరో టెస్ట్. ఎందుకంటే సుకుమార్ – దేవీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. దీంతో సుక్కు – దేవీ సినిమాపై అంచనాలు ఎప్పుడూ ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సినిమాకు సూపర్ మ్యూజిక్ ఇవ్వడంతో ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయినా దేవి ఇమేజ్ కి నష్టమే. అటు మహేష్ సినిమా.. ఇటు అల్లు అర్జున్ సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్.. సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందిస్తేనే టాప్ లీగ్ లో కొనసాగగలడు. లేదంటే స్టార్ హీరోల సినిమా ఛాన్స్ లు ఫ్యూచర్ లో దక్కడం కష్టమేనని అంటున్నారు. మరి దేవీ ఈ సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో వేచి చూడాలి.
Please Read Disclaimer