రజిని కోసం ఆ ముగ్గురు

0

సంక్రాంతి బరిలో నిల్వనున్న రజినీ కాంత్ ‘దర్బార్’ సినిమాకు సంబంధించి రేపటి నుండి భారీగా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. నిన్నటి వరకూ ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటి నుండి మొదలవుతాయనే అనే ప్రశ్నకు తాజాగా క్లారిటీ ఇచ్చి ఓ అప్డేట్ వదిలారు మేకర్స్.

ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో పక్కా మాస్ సినిమాగా తెరకెక్కుతున్న ‘దర్బార్’ కి సంబంధించి రేపు ఐదు గంటల ముప్పై నిమిషాలకు మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. అయితే ఈ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియాలో ఓ ముగ్గురు స్టార్ హీరోలు రిలీజ్ చేయబోతున్నారు.

‘దర్బార్’ హిందీ పోస్టర్ ని సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తుండగా మలయాళంకి సంబందించిన పోస్టర్ ని మోహన్ లాల్ రిలీజ్ చేస్తున్నారు. ఇక తమిళ్ తెలుగుకి సంబంధించి కమల్ హాసన్ రేపు సరిగ్గా అదే సమయానికి రిలీజ్ చేస్తారు. ఈ విషయాన్నీ లైకా సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అనౌన్స్ చేసారు. సో రేపటి నుండి మోషన్ పోస్టర్స్ తో సూపర్ స్టార్ ‘దర్బార్’ సందడి మొదలు కానుందన్నమాట. మరి ఈ మోషన్ పోస్టర్ తో రజినీ ఫ్యాన్స్ ను ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home