సైరా ఫ్లెక్సీ కడుతూ..ముగ్గురు చిరు ఫ్యాన్స్ కు కరెంట్ షాక్

0

సినీ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. వెయ్యి కళ్లతో ఎదురుచూడటమే కాదు.. మొదటి రోజు మొదటి షోను తామే చూడాలన్న ఉత్సాహం నేటికి తగ్గకపోవటం విశేషం. అంతేనా.. ఆయన నటించిన తాజా చిత్రం సైరా టికెట్ల కోసం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.

తమ అభిమాన నటుడి చిత్రం విడుదల సందర్భంగా ధియేటర్లను కటౌట్లు.. భారీ ఫ్లెక్సీలతో నింపేసే ఉత్సాహం ఇసుమంత కూడా తగ్గలేదన్న విషయం తాజాగా సైరా విడుదలవుతున్న థియేటర్లను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే.. ఇంతటి ఉత్సాహవాతావరణంలో అనుకోని రీతిలో చోటు చేసుకున్న ప్రమాదం షాకింగ్ గా మారింది.

హైదరాబాద్ మహానగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైరా విడుదల అవుతున్న థియేటర్ వద్ద చిరు ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంలో ముగ్గురు అభిమానులు కరెంట్ షాకుకు గురయ్యారు. ఈ ఘటనలో 30 ఏళ్ల చిరంజీవి.. 27 ఏళ్ల రమేశ్.. 19 ఏళ్ల ప్రశాంత్ ఉన్నారు. థియేటర్ కు ఉన్న సాహో బ్యానర్లను తొలగించి.. ఆ స్థానంలో సైరా ఫ్లెక్సీలను కట్టే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుద్ఘాతానికి గురైన ముగ్గురిలో చిరంజీవి.. రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం మెగా అభిమానుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
Please Read Disclaimer