విజయ్ హిట్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మురగదాస్

0

దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తమిళ నటుడు విజయ్ ఒకరు. అభిమానులు ముద్దుగా ‘దళపతి’ అని పిలుచుకునే విజయ్ ని అతని ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ మొదటి వరసలో ఉంటాడు. తుపాకి సర్కార్ పోలీసోడు విజిల్ మరియు అదిరింది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. మరోవైపు ఇండియాలో చెప్పుకోదగ్గ దర్శకులలో ఎఆర్ మురుగదాస్ ఒకరు. వీరిద్దరి కలయికలో ఇప్పటి దాకా రూపుదిద్దుకున్న అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తుపాకి సర్కార్ వీరిద్దరి కలయికలో వచ్చి తమిళ్ తోపాటు తెలుగులో కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తమిళ మీడియాలో వీరిద్దరి గురించి ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. ‘దళపతి’ విజయ్ మురగదాస్ లు మళ్ళీ కలవబోతున్నారనేది ఈ వార్త సారాంశం. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ సినిమా 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ ‘తుపాకి’ సీక్వెల్ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అన్ని బాషలలో ఒకేసారి విడుదల కానున్నదని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు కోలీవుడ్ లో వార్త వినిపిస్తుంది. ఈ వార్తలకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. విజయ్ – మురగదాస్ లు మళ్ళీ జోడీ కడుతున్నారన్న వార్త విని విజయ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ సినిమా పట్టాలెక్కితే వీరిద్దరి కలయికలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Please Read Disclaimer