టిక్ టాక్ లో బూతు పెరిగి టాక్ తగ్గిందా?

0

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అంతే.. మొదట్లో అందరూ వింతగా చూస్తారు. కానీ టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్నవారు కొత్త విషయం ఏదైనా మార్కెట్లోకి వస్తే వెంటనే ఒడిసిపట్టుకుంటారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం కావచ్చు.. యాప్ కావచ్చు.. అది ఏదైనా మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అలాంటి వారు వాడడం మొదలు పెడతారు. ఫేస్ బుక్ సంగతే తీసుకుంటే మొదట్లో యూత్.. ఈ జెనరేషన్ వారు ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు దాదాపు వారందరూ వాడడం తగ్గించారు.. ఇప్పుడు ఫేస్ బుక్ వాడే జనాల్లో పెద్ద వయసువారు ఎక్కువగా ఉన్నారట!

ఇక ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్.. ఇలాంటివన్నీ దాదాపు అందరికీ తెలిసినవే. ఈ లిస్టులోకి కొత్త వచ్చి దుమ్ములేపుతున్న యాప్ టిక్ టాక్(TikTok). ఇదో సోషల్ మీడియా వీడియో యాప్. లిప్ సింక్ వీడియోస్ దగ్గరనుండి.. ఒరిజినల్ వీడియోస్ వరకూ ఏవైనా షేర్ చెయ్యొచ్చు. అయితే వీడియో లెంగ్త్ 3 – 15 సెకండ్ల లోపే ఉండాలి. ఈ యాప్ ను 2017 లో లాంచ్ చేశారు. జస్ట్ రెండేళ్ళలోనే ప్రపంచవ్యాప్తంగా దుమ్ములేపుతోంది. అయితే ఈ టిక్ టాక్ మాయలో పడి కొందరేమో తమ ఆఫీసు పనులు పక్కన పెడుతున్నారట. కొందరేమో పిచ్చ ఫీట్లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో టిక్ టాక్ కొన్ని చోట్ల నిషేధాలు కూడా ఎదుర్కొంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే భారతదేశంలో ఈ యాప్ విపరీతంగా పాపులర్ అయింది. ఆ యాప్ తో ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. మన తెలుగువారినే తీసుకుంటే ఉప్పల్ బాలు లాంటి వారు జస్ట్ టిక్ టాక్ తో ఫేమస్ అయిన వారే. ఈ టిక్ టాక్ ఇండియాలో ప్రాచుర్యంలోకి వచ్చిన కొత్తలో వీడియోలలో అసభ్యత లేకుండా ఉండేవట. ఏవైనా సినిమా పాటలకు డ్యాన్సులు.. ఏవైనా హిట్ డైలాగ్స్ కు డబ్ స్మాష్ చేయడం లాంటివి ఎక్కువగా ఉండేవట. ఇవి కాకపోతే ఏవైనా షార్ట్ జోక్స్ చెప్పడం.. మిమిక్రీ చేయడం లాంటివి ఉండేవి. కొందరు మరీ పనిలేని యూజర్లు మాత్రం పళ్ళు తోముకోవడం లాంటి జఫ్ఫా వీడియోలను కూడా షేర్ చేసేవారు.

కానీ యూజర్లు పెరిగేకొద్ది.. షార్ట్ కట్ లో పాపులారిటీ సంపాదించడం కోసం కొందరు అసభ్యంగా ఉండే వీడియోలను ఆశ్రయిస్తున్నారట. దీంతో బూతు జోకుల దగ్గర నుంచి మొదలు పెడితే అసభ్యంగా ఉండే వీడియోలు షేర్ చేయడం ఎక్కువయిందని సమాచారం. అయితే బూతులను ఇష్టపడే జనాలు కోకొల్లలుగా ఉంటారు కదా.. దీంతో వల్గర్ గా ఉండే వీడియోలకు కూడా మంచి ఆదరణ కూడా దక్కుతోందట. దీంతో విమర్శకులు ఇది టిక్ టాక్ లో బూతు పెరిగి టాక్ తగ్గిందని విమర్శిస్తున్నారు. వల్గర్ వీడియోస్ ఎలా ఉంటాయో.. కింద శాంపిల్ ఉంది.. ఓ లుక్కేయండి. చిత్రమైన విషయం ఏంటంటే ఆ వల్గర్ వీడియోలను కలిపి ఒక పెద్ద వీడియో తయారు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే.. అక్కడ కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. బూతః బూతస్య బూతోభ్యః!
Please Read Disclaimer