ఢిల్లీలో ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య..

0

బాలీవుడ్ యంగ్ సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఇప్పటికి సినీ ప్రియులు మర్చిపోలేక పోతున్నారు. సుశాంత్ ఘటన మరవక ముందే నటి ప్రేక్షా మెహతా మరణం కుదిపేసింది. ఇంతలో తాజాగా మరో యంగ్ టాలెంటెడ్ టిక్ టాక్ స్టార్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. పాపులర్ టిక్‌టాక్ స్టార్.. డ్యాన్సర్ సియా కక్కర్ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. సియా ఆత్మహత్య వార్తను ఆమె మేనేజర్ అర్జున్ సారిన్ ఖరారు చేశారు. సియా ఆకస్మిక మృతి పట్ల ఆమె మేనేజర్ అర్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అయితే సియా మరణం గురించి అర్జున్ మాట్లాడుతూ.. ‘‘సియా ఆత్మహత్య వెనుక ఆమె వ్యక్తిగత కారణాలు ఏవో ఉన్నాయి. కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె తన పనిని తను ఎంతో బాగా చేసుకుంటోంది. ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ఆమెతో రాత్రి నేను మాట్లాడాను. ఆమె కూడా నాతో బాగానే మాట్లాడింది. నేను.. మా కంపెనీ ఫేమ్ ఎక్స్పర్ట్స్ ఎంతో మంది ఆర్టిస్ట్‌లను మేనేజ్ చేస్తున్నాం. సియా వద్ద అద్భుతమైన టాలెంట్ ఉంది. ప్రస్తుతం నేను ప్రీత్ విహార్‌లోని సియా ఇంటికి వెళ్తున్నాను’’ అని ఆయన తెలిపారు. అయితే సియాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

టిక్‌టాక్ తో పాటు ఇన్స్టాగ్రామ్.. స్నాప్‌చాట్.. యూట్యూబ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సియా యాక్టివ్‌గా ఉండేదట. ఎప్పటికప్పుడు సియా తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరించేదట. టిక్‌టాక్‌లో సియాకు దాదాపు 11లక్షల ఫాలోవర్లు.. ఇంస్టాగ్రామ్ల లో 1లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం. సియా ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట. ప్రస్తుతం సియా మృతి పై సంతాపం వ్యక్తం చేస్తూ నెటిజన్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సియా ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది.
Please Read Disclaimer