బన్నీ 19 టైటిల్ లాక్ చేశారా ?

0

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సీనియర్ నటి టబు జాయిన్ అయిన సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసిన యూనిట్ ఇకపై మెల్లగా ప్రమోషన్ ని ప్లానింగ్ ప్రకారం పెంచే పనిలో ఉంది. ఇదిలా ఉండగా దీనికి టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనని ఫిలిం నగర్ టాక్. నేను నాన్న పేరుని ఫిలిం ఛాంబర్ లో గీత ఆర్ట్స్ హారికా అండ్ హాసిని బ్యానర్లపై సంయుక్తంగా రిజిస్టర్ చేసినట్టు సమాచారం.

నిజానికి ఈ నేను నాన్న టైటిల్ గతంలోనే ప్రచారంలోకి వచ్చింది. దాని తర్వాత అలకానంద అనే మరో పేరు హల్చల్ చేసింది. అయితే కథ ప్రకారం ఫాదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని నడిచే ఎమోషనల్ స్టోరీ కాబట్టి నేను నాన్న యాప్ట్ గా ఉంటుందని త్రివిక్రమ్ భావించాడట. అధికారిక ప్రకటన రావడానికి మాత్రం కొంచెం టైం పట్టొచ్చు. విడుదలకు ఎలాగూ ఆరు నెలల దాకా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రకటించాల్సిన అవసరం పడకపోవచ్చు.

నేను నాన్న టైటిల్ కొంచెం ఓల్డ్ స్టైల్ లో రెగ్యులర్ గా అనిపిస్తున్నా అప్పట్లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదికి కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి కాబట్టి వాటినేమి పట్టించుకోకపోవచ్చు. జులాయి-సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ నేను నాన్న(ప్రచారంలో ఉన్న టైటిల్)లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు-జయరాం- మురళీశర్మ – రావు రమేష్- నవదీప్ – సుశాంత్ – నివేత పేతురాజ్-బోమన్ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2020 సంక్రాంతిని లాక్ చేసుకున్న ఈ మూవీ బన్నీకి ఏడాదిన్నర తర్వాత రానుండటంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి
Please Read Disclaimer