వాల్మీకికి టైటిల్ కష్టాలు.. కోర్టులో పిటిషన్

0

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లతో సినిమాపై అంచనాలు హైప్ కు వెళ్లిపోయాయి. డీజే తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో పాటు అటు పూజాహెగ్డే వరుణ్ పక్కన నటిస్తుండడంతో మంచి అంచనాలే ఉన్నాయి.

స్టిల్స్ లో వరుణ్ లుక్ చూసిన వారు కూడా సినిమా చూడాలన్న ఆతృతతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కష్టాల్లో పడింది. వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ సామాజికవర్గ మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమాను రూపొందించారని… తక్షణమే వాల్మీకి టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో బోయ హక్కుల పరిరక్షణ సమితి ఈ సినిమా టైటిల్ పై హైర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మరి ఈ పిటిషన్ పై కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో ? వాల్మీకి ఈ టైటిల్ కష్టాలు తొలగించుకుని అనుకున్న టైంకే థియేటర్లలోకి వస్తుందో ? లేదో ? చూడాలి.

14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుండగా… అదే రోజు నాని గ్యాంగ్ లీడర్ కూడా ఈ సినిమాకు పోటీగా వస్తోన్న సంగతి తెలిసిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home