పెళ్లి గోల వేగలేకపోతున్న బ్యాచిలర్ హీరోలు

0

టాలీవుడ్లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా వరుసగా పెళ్లితో ఓ ఇంటివారవుతున్నారు. ఇండస్ట్రీలో ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే వున్నారు. పెళ్లెప్పుడు? అంటూ అడిగేస్తుంటే ముఖం చాటేసే హీరోల సంఖ్య కూడా పెద్దదే. అందులో ముందు వరుసలో ఉన్న పేరు ప్రభాస్. `బాహుబలి` తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ మరోసారి మాటదాటేయడం తెలిసిందే. పెదనాన్న కృష్ణంరాజు ఎప్పటి నుంచో ప్రభాస్ ని ఓ ఇంటివాడిగా చూడాలని ఆరాటపడుతున్నా ఆ ఘడియ రాలేదు. ప్రభాస్ తరువాతి స్థానంలో వున్న హీరో రానా దగ్గుబాటి.

ప్రస్తుతం సినిమా షూటింగ్లకు విరామమిచ్చి విశ్రాంతి తీసుకుంటున్న దగ్గుబాటి హీరో పెళ్లి గురించి కూడా గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. కానీ రానా మాత్రం పెళ్లిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.

ప్రభాస్ రానాల సంగతి అటుంచితే తరువాత స్థానంలో వున్న హీరో రామ్. అప్పుడే ఒంటిమీదికి 31 వచ్చేశాయి. ఇటీవల కెరీర్ పరంగా కొంత డైలమాని ఎదుర్కొన్న రామ్ `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో మంచి కంబ్యాక్ హిట్టు సొంతం చేసుకున్నాడు. ఇక లైఫ్ లో సెటిలవ్వడమే పెండింగ్ అని అభిమానులు భావిస్తున్నారు. అసలింతకీ ఎనర్జిటిక్ రామ్ ఇంకా పెళ్లెప్పుడు? వై.. స్టిల్ బ్యాచిలర్? అని అంతా రామ్ గురించి వాకబు చేస్తున్నారు. ఇకనైనా రామ్ పప్పన్నం తినిపించే తీపి కబురు చెబుతాడేమో చూడాలి. తాజాగా రామ్ ఓ చిన్నారి బాలకుడిని ఎత్తుకుని పబ్లిక్ కి ఇచ్చిన ఫోజు చూశాక ఇక పెళ్లికి సమయం వచ్చింది అంటూ అభిమానులు ఛీర్ చేశారు.

రామ్ తరువాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ. ఈ హీరో క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్న ఈ రౌడీ హీరో బాలీవుడ్ బ్యాచ్ తో తెగ పార్టీలు చేసుకుంటున్నాడట. నితిన్ ది కూడా ఇదే పరిస్థితి. నితిన్ కనిపించగానే ఇంట్లో వాళ్లు పెళ్లెప్పుడవుతుంది బాబూ అంటూ ఆటపట్టిస్తున్నారట. శర్వానంద్- సందీప్ కిషన్ కూడా పెళ్లికి త్వరపడితే మంచిదని.. ఇదే మంచి సమయమని సన్నిహితులు.. ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మందే సలహాలు ఇస్తున్నారట.
Please Read Disclaimer