వార్నీ… వెబ్ సైట్లు మరీ అంత అలుసైపోయాయా?

0

సినిమాల ప్రమోషన్స్ కు వెబ్ సైట్లు కావాలి. యూట్యూబ్ ఛానెల్స్ కావాలి. టీవీలు కావాలి. పేపర్లు కావాలి. అయితే సినిమా ఇండస్ట్రీ గురించి అంతా పాజిటివ్వే రాయాలి. అదేంటో మరి. జనాలకు కావాల్సింది న్యూట్రల్ గా అభిప్రాయాలు వ్యక్తం చేయడం. నెగెటివ్ గా ఉన్నదాన్ని పాజిటివ్ గా రాయడం కాదు. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఓ సామెత. అలాగే ఈమధ్య కొందరికి వెబ్ సైట్లు అన్నీ తప్పుడువిగా కనిపిస్తున్నాయి.

అదేంటో “స్ప్రెడ్ పాజిటివిటీ” అంటూనే వెబ్ సైట్ల మీద నెగెటివిటీ ని స్ప్రెడ్ చెయ్యడం మహా వింత. ఇక వెబ్ సైట్ల మీద ఏదో కోట్లు సంపాదిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగిస్తున్నారు. వెబ్ సైట్ ను మెయింటెనెన్స్ కు ఎంతమంది ఉద్యోగులు కావాలి? సర్వర్ మెయింటెనెన్స్ కు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా క్రైసిస్ లో కూడా ఉద్యోగులను లే ఆఫ్ చెయ్యకుండా జీతాలు ఇస్తూ.. ప్రజలకు నిత్యం సమాచారం అందిస్తున్న వెబ్ సైట్ లను దారుణంగా మాట్లాడడం ఎంత వరకూ కరెక్ట్ అంటున్నారు వెబ్ మీడియా పెద్దలు.

వెబ్ సైట్ లపై నోరు పారేసుకుంటున్న హీరోలు ఎంతమందికి ఫుల్ టైం జాబ్స్ ఇస్తున్నారు? టెంపరరీగా ఉద్యోగాల్లో పెట్టుకుని వారిని తర్వాత వదిలేస్తున్నారు. ఇక సినీ పెద్దలు PRO లకు ఎంత జీతాలు ఇస్తున్నారో చెప్పగలరా? ఏదో ఒక వెబ్ సైట్ డబ్బు డిమాండ్ చేసిందని అంటున్నారు కదా.. వాళ్ళకి ధైర్యంగా ‘ఇవ్వము’ అని చెప్పండి. అంతే కానీ అన్నీ వెబ్ సైట్లను తిట్టడం ఎంత వరకూ కరెక్టో చెప్పాలి.

వెబ్ సైట్లను సులువుగా తిట్టేస్తున్నారు కానీ మీ సోషల్ మీడియా ఖాతాలైన ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్స్టా ఖాతాల కింద కామెంట్లు చూస్తే నెటిజన్లు ఎంత మంది మిమ్మల్ని తిడుతున్నారో తెలుస్తుంది. అదంతా తెలిసి కూడా ఎందుకు సోషల్ మీడియా ఖాతాలను వదిలెయ్యరు? మనల్ని విమర్శించారని అందరిని కట్ చేసుకుంటూ పోతే ఏమౌతుంది? ఈ రోజు వెబ్ సైట్ లను.. రేపు యూట్యూబ్ ను.. ఎల్లుండి టీవీ ఛానెల్స్ ను.. ఆ తర్వాత ప్రింట్ పేపర్లను.. నెక్స్ట్ సోషల్ మీడియా ఖాతాలను అన్నిటినీ వదిలేసుకుంటూ చివరకు మిగిలేది ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారో.. సరిగ్గా అక్కడికే వెళ్తారని సోషల్ మీడియాలో కొందరు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదో ఒక డొమెయిన్ పెట్టి వెబ్ సైట్ క్రియేట్ చేసెయ్యొచ్చు అని అతి సులువుగా సలహాలు ఇస్తున్నారు. మరి అలా ఎందుకు చెయ్యలేకపోతున్నారు? అలా అందరూ ఓ 100 సైట్లు పెట్టండి. పాజిటివిటి ని స్ప్రెడ్ చెయ్యండి. చెత్త సినిమాలకు ఆ వంద సైట్లలో 5 కు 5 రేటింగులు ఇచ్చుకోండి. అంతా పాజిటివ్ న్యూసే. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా నెగెటివ్ వార్త కాబట్టి కవర్ చెయ్యకుండా అది ఓ కుట్ర అని పాజిటివ్ ఆర్టికల్ రాసిపారేయండి. ఎవరిపైనైనా #మీటూ ఆరోపణలు వస్తే నెగెటివ్ కాబట్టి రాయకుండా పాజిటివ్ గా F2 స్టైల్ కామెడీ చెయ్యండి. అప్పుడు ఈ పాజిటివిటీ ఎలా పని చేస్తుందో చూడాలి. ప్రస్తుతం అక్షరాలా ఇదే కాన్సెప్ట్ తో పని చేస్తున్న కొన్ని సినీ ప్రముఖుల సైట్లను ఎందుకు ఎవరూ చదవడం లేదనే విషయం అర్థం చేసుకోవాలి.

ఈమధ్య చాలామందికి పాజిటివిటి ఓ ఫ్యాషన్ అయింది. కానీ నెగెటివిటి ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ విచ్ యూ కాంట్ ఎవాయిడ్. HIV కి పాజిటివ్ రాకూడదు. కరోనా కు పాజిటివ్ రాకూడదు. నెగెటివ్ మాత్రమే రావాలి. దీన్ని బట్టి అర్థం అయ్యేదేంటంటే జనాలకు కావాల్సింది జస్ట్ పాజిటివిటి కాదు.. జస్ట్ నెగెటివిటీ కాదు. రెండూ. ఉన్నది ఉన్నట్టు చెప్పడం.. అంటే న్యూట్రల్ వెర్షన్. ప్రస్తుతం వెబ్ సైట్లు చేస్తున్నది అదే.

ఫైనల్ గా.. ఎవరి ప్రొఫెషన్ వారికి గొప్ప. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదం చాలామంది వింటూ ఉంటారు కానీ అర్థం తెల్సినట్టు లేదు. వెబ్ సైట్ల వాళ్ళు తక్కువ వారని.. అందులో పని చేసే వారు వేస్ట్ అన్నట్టుగా కొందరు సెలబ్రిటీలు మాట్లాడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక హీరోలలో చాలామందికి క్రేజ్ తీసుకొచ్చింది.. వారి సినిమాలకు హైప్ పెంచేవారిలో వెబ్ సైట్ల పాత్ర కీలకం అని గుర్తెరిగితే మంచిది. మరి ఇంత చులకనగా మాట్లాడుతున్న కొందరు సెలబ్రిటీలు అసలు వెబ్ సైట్లను ఎందుకు పాఠకులు.. మిగతా సెలబ్రిటీలు చదువుతున్నారో అర్థం చేసుకోవాలని సోషల్ మీడియాలో కొందరు కౌంటర్లు ఇస్తున్నారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home