హాస్యనట సమ్మేళనం

0

ప్రపంచంలో ఏ పరిశ్రమతో పోల్చినా.. టాలీవుడ్ లో హాస్యనటుల సంఖ్య ఎక్కువే. కమెడియన్స్ ఎక్కువ వున్నారు కాబట్టి వారి మధ్య పోటీ కూడా ఎక్కువే. అయితే అది కేవలం వృత్తిగతం. బయట మాత్రం అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. తమకంటూ ఒక అసోసియేషన్ యాక్టివిటీస్ ని కూడా ప్రారంభించారు. ఏ ఇండస్ట్రీలో కనిపించని ఐక్యత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ మధ్య కనిపిస్తోందనడానికి ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

గత కొంత కాలంగా యంగ్ టాలెంటెడ్ కమెడిన్స్ అంతా ఓ ట్రూప్‌గా చేరి ప్రతి వారం ఓచోట కలుస్తూ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఓ కలర్ కోడ్ ని కూడా ప్లాన్ చేశారు. ఆ పార్టీకి వచ్చేవాళ్లంతా ఒకే కలర్ డ్రెస్ ని ధరించాల్సి ఉంటుందన్నది కండిషన్. ఈ ఫార్ములా ఇతర ఇండస్ట్రీల కమెడియన్స్‌కి ఆదర్శం అనే చెప్పాలి. ఇంతకీ ఈ థీమ్ కి రూపకల్పన చేసింది ఎవరు? అంటే.. వెన్నెల కిషోర్ దీనికి కర్త కర్మ క్రియ అని తెలుస్తోంది. ఫ్లైయింగ్ కలర్స్ పేరుతో కమెడియన్స్ అందరిని ఒక తాటిపైకి చేర్చి వారం వారం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ టీమ్‌లో వెన్నెల కిషోర్‌తో పాటు అదుర్స్ రఘు- షకలక శంకర్-శ్రీనివాసరెడ్డి-ధన్‌రాజ్- నందు- సత్యం రాజేష్- చిత్రం శ్రీను- సప్తగిరి- ప్రవీణ్- నల్ల వేణు-సత్య-నవీన్ తో పాటు ఇంకొంత మంది కూడా వున్నారు. వీరంతా ప్రతి వారం ఒక్కో కలర్ డ్రెస్ కోడ్ తో కలుసుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారు. కమెడియన్ గ్యాంగ్ కలర్ ఫుల్ థీమ్ అదిరిందని కొంత మంది కితాబిస్తుంటే మరి కొంత మంది డిఫరెంటుగా.. కొంటెగా సోషల్ మీడియాలో ఆటపట్టిస్తున్నారు.

లేటెస్ట్ పార్టీకి హాజరైన ప్రతి కమెడియన్ బ్లూ జీన్స్.. వైట్ షర్ట్ ధరించి రావడం ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల్ని వెన్నెల కిషోర్ తన ఇన్ స్టా పేజీ ద్వారా షేర్ చేశారు. దీనికి ఓ లేడీ నెటిజన్ కొంటెగా పోస్ట్ పెట్టింది. `తిన్నావా తిన్నా.. ఏం కూర.. కాకర కాయ.. చేదుగా లేదా.. మా అమ్మ సెక్కరేసింది` అంటూ పగలబడి నవ్వుతున్న ఈమోజీని వెన్నెల కిషోర్ పెట్టిన ఫొటోకు లింక్ చేయడం కడుపుబ్బా నవ్విస్తోంది.
Please Read Disclaimer