జూదంలో నిండా మునిగిన హాట్ కపుల్

0

టాలీవుడ్ లో ఆ హాట్ కపుల్ గురించి నిరంతరం ఏదో ఒక హాట్ టాపిక్ రన్నింగ్ లో ఉంటుంది. ఆ ఇద్దరి ఆదర్శ జీవనం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటారంతా. అయితే ఇటీవల ఆ జోడీ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎంచుకున్న ఓ మార్గం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిస్తోంది. అసలింతకీ ఆ హాట్ కపుల్ ఎంచుకున్న ఆ దారి ఏమిటి? అన్నది తెలిస్తే షాకవ్వాల్సిందే.

ఇంతకీ కష్టం అంతా మర్చిపోయేలా ఆ ఇద్దరు ఎక్కడ రిలాక్స్ అవుతుంటారు? ఏం చేస్తుంటారు? అంటే.. ఎవరికీ అందని దూర తీరాలకు వెళ్లిపోయి నచ్చినట్టు జీవితాన్ని ఆస్వాధిస్తున్నారట. అందునా విదేశాల్లో కేసినోవాలకు వెళ్లిపోవడమే గాక అక్కడ జూదానికి అలవాటు పడిపోయారట. ఎంతగా అంటే రిలాక్స్ అయ్యేందుకు కచ్ఛితంగా అక్కడికి వెళ్లాల్సిందే అన్నంతగా అడిక్ట్ అయిపోయారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.

ప్రపంచ దేశాల్లో కేసినోలు ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరిపోతుంటారు. అక్కడ నచ్చినట్టు కార్డ్ గేమ్స్ ఆడేస్తూ ఆ ఆటలోనే రిలాక్స్ అవుతుంటారు. అలా గ్యాంబ్లింగ్ లో ఇప్పటికే రాటు దేలిపోయారు. అంతేకాదు ఇటీవలే ఈ ఆటలో జాక్ పాట్ తగిలిందట. అలా వచ్చిన మొత్తాన్ని ఏం చేశారు? అంటే ఆ మొత్తాన్ని తిరిగి వేరొక దేశానికి ఎగిరిపోయి అక్కడ కేసినోలు ఆడారట. ఇదంతా చూస్తుంటే ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో 007 అతడి గాళ్ ఫ్రెండ్ ఎస్కేప్ వ్యవహారంలా ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత స్వేచ్ఛగా అల్ట్రా రిచ్ గా ఎంజాయ్ చేయడం బాగానే ఉంది కానీ.. ఎంతో శ్రమిస్తే కానీ డబ్బు సంపాదించలేం. అలా ఆర్జించిన దానిని ఇలా జల్సాలకు తగలేయడం ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఆ జంటనే ఆలోచించుకోవాలి మరి.
Please Read Disclaimer