రొమాంటిక్ భామపై టాలీవుడ్ ఫిలిం మేకర్ల దృష్టి!

0

ఈ జెనరేషన్ లో ఒక హీరోయిన్ కు క్రేజ్ రావాలంటే లుక్స్ ఉండాలి.. బోల్డ్ యాటిట్యూడ్ ఉండాలి. వీటికి యాక్టింగ్ కూడా జతచేరితే ఆ హీరోయిన్ కు తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం ‘రొమాంటిక్’ హీరోయిన్ కేతిక శర్మ ఒక్కసారిగా తన లుక్స్ తో.. బోల్డ్ యాటిట్యూడ్ టాలీవుడ్ ఫిలిం మేకర్లను ఆకర్షించిందనే టాక్ వినిపిస్తోంది.

పూరి జగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’ తో కేతిక శర్మ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈమధ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఒక పోస్టర్లో బీచ్ నేపథ్యంలో ఆకాష్ పూరి ఈ భామను భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. మరో పోస్టర్లో కేతిక టాప్ లేకుండా ఆకాష్ ను గట్టిగా హత్తుకుంది. ఈ పోస్టర్ ను చూసిన ప్రేక్షకులు ఎంత షాక్ అయ్యారో ఏమో కానీ టాలీవుడ్ ఫిలిం మేకర్లలో మాత్రం కలకలం రేగిందట. ఈ హాటు భామ ఎవరంటూ ఎంక్వైరీలు మొదలు పెట్టారట. కేతిక యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని ఆరాలు తీస్తున్నారట. ఒకవేళ యాక్టింగ్ కనుక యావరేజ్ అని తెలిసినా చాలు తమ సినిమాలకు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. పూరి సారు స్కూల్ నుంచి వచ్చిన ఒక్క పోస్టర్ దెబ్బతో హీరోయిన్ కు ఇలా ఎంక్వైరీలు తెచ్చిపెట్టడం గొప్ప విషయమే కదా.

ఇక ఈ భామ గురించి మన ఫిలిం మేకర్ల కంటే సోషల్ మీడియాలో ఉండే కళాపోషకులైన నెటిజన్లకు చక్కగా తెలుసు. ఎందుకంటే ఇన్స్టా గ్రాము వేడిని పెంచి ఆ వేడితో ఎంతో కాలం నుంచి చలి కాచుకుంటూ ఉంది ఈ కేతిక. ‘రొమాంటిక్’ సినిమా కనుక హిట్ అయితే ఈ భామకు ఫుల్ గా ఆఫర్లు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది అయితే కేతిక టాలీవుడ్ న్యూ సెన్సేషన్ అంటూ అంచనాలు వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!