టాలీవుడ్ నేర్చిన గొప్ప పాఠం ఇదే..!

0

దక్షిణాదిలో సినిమా అంటే ఒకప్పుడు అందరూ చెన్నై వంక చూసేవారు. సినిమాలో నటించాలని కోరిక ఉన్నవారు ఎన్ని తిప్పలు పడైనా మద్రాసు గడప తొక్కి అవకాశాల కోసం వేచి చూసేవారు. వ్యక్తిగత ప్రతిభనో.. పరిచయాల ద్వారానో మొత్తానికి మన తెలుగువాళ్లు మద్రాసు సినిమా టాకీస్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగి హైదరాబాద్ కు సినిమా పరిశ్రమను తీసుకొచ్చారు. మొదటి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ 1931లో తీసిన హెచ్ ఎంరెడ్డి గారు రికార్డులు సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఎప్పటికప్పుడు ప్రత్యేకత సాధించుకుంటుందనడంలో సందేహం లేదు.

* తెలుగు సినిమా ఖ్యాతి పెరిగింది.

హైదరాబాద్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏర్పడినా దేశవ్యాప్తంగా చూస్తే తెలుగు సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో తెలుగు సినిమాలో నటించాలంటే తారలంతా భయపడిపోయేవారు. ఆ సమయంలో ఒక్కసారి తెలుగు సినిమాలో నటిస్తే తమ క్రేజ్ తగ్గినట్లేనని భావించేవారు. అయితే రాను రాను సీన్ మారింది. ఒకప్పుడు టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన వాళ్లే నేడు అవకాశాల కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. బాలీవుడ్ నిర్మాతలు సైతం తెలుగు సినిమా కొనేందుకు మందుగానే బుక్ చేసుకుంటున్నారంటే ప్రస్తుతం తెలుగు సినిమాకు ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.

* టాలీవుడ్ – కోలీవుడ్ ల మధ్య తీవ్ర పోటీ

చెన్నై నుంచి తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పడిన తరువాత టాలీవుడ్ – కోలీవుడ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉన్న తమిళ సినిమాకు పోటీగా తెలుగు సినిమాలు ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఇప్పుడు మనవాళ్లు చరిత్ర తిరగరాయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ హయాంలో అనేక సినిమాలు తీసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ‘మాయా బజార్’ లాంటి బిగ్గెస్ట్ హిట్టుతో దేశ సినిమా పరిశ్రమ టాలీవుడ్ వైపు తొంగి చూసింది.

* ప్రపంచం మొత్తం.. టాలీవుడ్ వైపు..

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో దానికి అనుగుణంగా సినిమా పరిశ్రమ కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. గ్రాఫిక్స్ డిజైన్ నుంచి మల్టీమీడియాతో మన దర్శకులు ఆడుకుంటున్నారు. అందుకు ఉదాహరణే దిగ్గ దర్శకుడు రాజమౌళి తీసిన బహుబలి సినిమా. రెండు పార్టులుగా వచ్చిన బహుబలి మొదటి పార్టు వచ్చిన తరువాత రెండో పార్టు కోసం ప్రపంచ సినిమా పరిశ్రమ ఎదురు చూసిందనడంలో అతిశయోక్తి కాదు. కేవలం సినిమా తీయడంలోనే కాకుండా కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించి బాలీవుడ్ సరసన చేరింది. ఈ సినిమాను బాలీవుడ్లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ టేకాప్ చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదని నిరూపించిన సినిమా బాహుబలి. ఆ సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్త స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ‘సాహో’ను దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమా మార్కెట్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇదే బాటలో రాబోయే సైరా – ఆర్ ఆర్ ఆర్ లు కూడా కంటెంట్ తో దేశవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే చాలు సినిమాలు ఎక్కడైనా ఆడుతాయని టాలీవుడ్ దర్శకులు నిరూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి కథలతో దేశానికే దిశానిర్ధేశం చేస్తున్నారు. కలెక్షన్లు కొల్లగొడుతున్నారు.

*తాజాగా కామిక్..’ది లయన్ కింగ్’..

హాలీవుడ్ నుంచి వచ్చిన కామిక్ సినిమాలు ఇండియాలో బాలీవుడ్ మాత్రమే గతంలో విడుదల అయ్యేవి. ఆ తరువాత ఆ ఛాన్స్ను చెన్నై పరిశ్రమ చేజిక్కించుకునేంది. దాదాపు చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదల చేసేవారు. ప్రస్తుతం ఎలాంటి హాలీవుడ్ సినిమానైనా బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయడంలో తెలుగు సినిమా పరిశ్రమ ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లోనూ అగ్ర నటులతో పాటు అగ్ర నిర్మాతలు ఇలాంటి సినిమాలను విడుదల చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ది లయన్ కింగ్ లాంటి కంటెంట్ బేస్ డ్ సినిమా ఏ భాషలోనైనా ఆడుతుంది. అలాంటి కథలే బాహుబలి – సాహో – సైరా – ఆర్ ఆర్ ఆర్ లతో మన టాలీవుడ్ దర్శకులు ప్రపంచ – దేశ మార్కెట్ ను కొల్లగొడుతుండడం విశేషంగా చెప్పవచ్చు. దీన్ని బట్టి అందరికీ నచ్చే యూనివర్సల్ కంటెంట్ ఉంటే భాష – దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమాను ఆడించవచ్చని – మార్కెట్ ను పెంచవచ్చని మన దర్శకులు ఆ దిశగా ఆలోచిస్తూ కథలను రూపొందించుకోవడం విశేషంగా చెప్పవచ్చు.
Please Read Disclaimer