సుశాంత్ సింగ్ తో కలిసి నటించిన టాలీవుడ్ యువ హీరో…!

0

టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ గుర్తింపు కోసం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కున్నాడు నవీన్. థియేటర్ ఆర్టిస్టుగా విజయ్ దేవరకొండతో కలిసి తొలినాళ్లలో చాలా కష్టాలు ఎదుర్కున్నాడు. సినిమా అవకాశాల కోసం 15 వందల ఆడిషన్స్ కు హాజరయ్యాడంటేనే అర్థం చేసుకోవచ్చు నవీన్ సినిమా కష్టాలు. అయితే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తరువాత నవీన్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. వెనుకా ముందు గాడ్ ఫాథర్ లు ఎవరు లేకుండా చలన చిత్రసీమలో అడుగుపెట్టి సక్సెస్ అయిన నవీన్ పోలిశెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టే వారికి ఒక రోల్ మోడల్ గా నిలిచారు.నిజానికి ‘ఏజెంట్ ఆత్రేయ’ సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ కి హిందీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహించిన ‘చిచ్చోరే’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ఇటీవల సూసైడ్ చేసుకొని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో యాసిడ్ పాత్రలో సుశాంత్ తో కలిసి తనదైన కామెడీ టైమింగ్ తో ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించాడు. బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు కొన్ని ఇంటరెస్టింగ్ వీడియోలు చేసిన నవీన్ నార్త్ లో బాగానే పాపులర్ అయ్యాడు. అతడి టాలెంట్ చూసి నితీష్ తివారి ‘చిచ్చోరే’లో సుశాంత్ – శ్రద్ధాకపూర్ లతో కలిసి నటించే అవకాశం ఇచ్చాడు. కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం నవీన్ ని షాక్ కి గురి చేసింది.

సుశాంత్ కి నివాళులు అర్పిస్తూ ఆవేదనతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు నవీన్. ”సుశాంత్ నహీ యార్! షాక్ అండ్ హార్ట్ బ్రేకింగ్. ‘చిచోరే’ సెట్స్ లో అతన్ని కలిశాను. సినిమా కంప్లీట్ అయ్యే సమయానికి అతను నాకు సోదరుడిలా మారిపోయాడు. అతని వల్ల ఇది నా ఫస్ట్ సినిమా అని ఎప్పుడూ నాకు అనిపించలేదు. అతను ఈ విధంగా మరణించడం నాకు షాకింగ్ గా ఉంది. నేను ఈ సమయంలో ఎక్కువ మాట్లాడే స్థితిలో లేను. ఐ మిస్ యూ మై బ్రదర్. సెట్ లో మీతో ఉన్న జ్ఞాపకాలు సైన్స్ స్పోర్ట్స్ సినిమాలు డ్యాన్స్ అలా మీతో గడిపిన అందమైన అనుభూతుల్ని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటాను. ప్రకాశవంతమైన మనస్సులలో ఒకటి నాకు తెలిసే భాగ్యం. నా స్నేహితుడికి ఆత్మ శాంతి కనుగొనాలని ప్రార్థిస్తున్నాను. మీరు బాగా ఇష్టమైన నక్షత్రాల మధ్య మిమ్మల్ని చూస్తాను” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Please Read Disclaimer