టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త ప్లాన్

0

సౌత్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అంతా కూడా తమ సినిమాల ప్రమోషన్ కు సొంతంగా ఒక టీంను ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. సినిమాల ప్రమోషన్ విషయంలో మరియు హీరోల రెగ్యులర్ అప్ డేట్స్ విషయంలో ఆ టీం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సౌత్ హీరోలు మాత్రం సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు.

ప్రతి హీరోకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నా.. అందులో మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా వారి వ్యక్తిగత విషయాలు ఫొటోలు ఇంకా కొన్ని సామాజిక విషయాల గురించి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా స్టార్ హీరోలు ఉండటం లేదు. ఇకపై టాలీవుడ్ హీరోలు కూడా సోషల్ మీడియాలో తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ను ఎక్కువ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ లతో పాటు ఇంకా కొందరు హీరోలు సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో వారి గురించి వారి సినిమాల గురించి ప్రచారం చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారట. ఆ టీం పూర్తిగా సదరు హీరోకు సంబంధించిన యాక్టివిటీస్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయబోతున్నారు.

ఫ్యాన్ పేజ్ లతో పాటు సినిమాలకు సంబంధించిన పేజ్ లను కూడా ఈ టీంలు నిర్వహిస్తాయి. మొత్తానికి బాలీవుడ్ స్టార్స్ మాదిరిగా సోషల్ మీడియాను ఉపయోగించుకుని మన స్టార్ హీరోలు కూడా ప్రమోషన్ నిర్వహించేందుకు ముందడుగు వేశారు.
Please Read Disclaimer