ఎక్కువ కదా అంటే.. డిమాండ్ ఉంది కదా అంటోంది!

0

ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. మొదట్లో రెండు హిట్లతో జోరు చూపించిన ఈ భామకు ఆ తర్వాత పరాజయాలు పలకరించాయి కానీ దాంతో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఒక టాప్ హీరో సినిమాలో నటిస్తోంది. అయితే రీసెంట్ గా ఈ భామ తన రెమ్యూనరేషన్ ను విపరీతంగా పెంచేసిందట. దీంతో ఆ రెమ్యూనరేషన్ దెబ్బకు నిర్మతలు ఖంగుతిని వేరే హీరోయిన్ ను చూసుకుంటున్నారట.

ఈ విషయమే రీసెంట్ గా ఆమెతో ఎవరైనా మాట్లాడితే తిరిగి వారికి క్లాస్ పీకుతోందట. ఒక హీరోయిన్ కు ఎంత ఇవ్వాలో నిర్మాతలకు తెలుసని డిమాండ్ ను బట్టే ఎప్పుడూ రెమ్యూనరేషన్ ఇస్తారని అంటోంది. ఒక నిర్మాత హీరోయిన్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాడంటే ఆ హీరోయిన్ ను అంత డిమాండ్ ఉందన్న సంగతి అర్థం చేసుకోవాలని అంటోందట. అంతే కాదు.. తన రెమ్యూనరేషన్ అందరూ అనుకునేంత ఎక్కువ కాదని.. ఇంతవరకూ ఒక్క సినిమాను కూడా రెమ్యూనరేషన్ తక్కువ అన్న కారణంతో వదులుకోలేదని చెప్తోందట. ఏదైనా సినిమాకు ఇంతవరకూ నో చెప్పి ఉన్నా.. అది కథ నచ్చకపోతేనే అని.. డబ్బు కారణం కాదని అంటోంది

ఇంత కథ చెప్పిన ఆ బ్యూటీ తన రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం బైటపెట్టకపోవడం విశేషం. ఈ సంగతి తెలిసినవారు అమ్మడికి టాలీవుడ్ లో ఎలా మసలుకోవాలో.. ఎలా డబ్బులు పిండుకోవాలో తెలిసిపోయిందని కామెంట్ చేస్తున్నారు. అయినా చేపలకు ఈత నేర్పించాలా? అలానే హీరోయిన్లకు డబ్బు విషయాలు టాలీవుడ్ మేకర్స్ నేర్పించాల్సిన పని లేదు.. అవే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి
Please Read Disclaimer