జగన్ ఆ నిర్ణయంతో అల్లు వారి కొత్త వ్యాపారం

0

ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాత అంటే ఠక్కున వినిపించే పేర్లలో అల్లు అరవింద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్ ను ఆ నలుగురు గుప్పిట్లో పెట్టి ఆడిస్తున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ నలుగురిలో అల్లు అరవింద్ కూడా ఉంటాడని చాలా మంది భావన. సినిమా నిర్మాణం.. డిస్ట్రిబ్యూషన్.. థియేటర్ల వ్యవహారం ఇలా సినిమా రంగంకు చెందిన అనేక విభాగాల్లో అల్లు అరవింద్ డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా భాగస్వామి అయ్యి ఉన్నారు. భవిష్యత్తు మొత్తం ఓటీటీ దే అనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ ఇటీవలే ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే.

సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్ ఇంకా పలు వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. ఆయన పెద్దబ్బాయి అల్లు బాబీ పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు అల్లు వారు మరోకొత్త వ్యాపారంకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం రాజధానిని వైజాగ్ కు మార్చాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెట్టడం కూడా జరిగి పోయింది. అతి త్వరలోనే అధికారికంగా వైజాగ్ రాజధానిగా మారబోతుంది.

ఇలాంటి సమయంలో వైజాగ్ అనూహ్యంగా అభివృద్ది చెందబోతుంది. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు వైజాగ్ లో భారీ మొత్తంలో భూములు కలిగి ఉన్నారు. గత 20.. 30 ఏళ్లుగా సినిమా పరిశ్రమ వారు అక్కడ భూములు కొనుగోలు చేస్తూ ఉన్నారంటూ వార్తలు వచ్చేవి. అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీకి కూడా వైజాగ్ లో ప్లాట్లు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్లాట్స్ లలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా నిర్మాణరంగ వ్యాపారంలోకి అల్లు ఫ్యామిలీ ఎంటర్ అవ్వాలని భావిస్తుందట. ఇప్పటికే అల్లు అరవింద్ ఆ విషయమై అడుగులు వేస్తున్నారట.

తమ సొంత భూముల్లోనే కాకుండా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖుల ప్లాట్స్ ల్లో కూడా నిర్మాణాలు చేపట్టేందుకు వారితో ఒప్పందాలు చేసుకోబోతున్నారట. అల్లు అరవింద్ అండ్ టీం ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఖచ్చితంగా విజయవంతం అయ్యారు.. కనుక ఈ నిర్మాణ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేయడంతో పాటు తన కస్టమర్లకు ఆనందాన్ని పంచుతారు అంటూ ఆయన సన్నిహితులు మరియు మెగా ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer