టాలీవుడ్: పెళ్ళి ఊసెత్తని సీనియర్ బ్యాచిలర్లు

0

ఇండియా మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే భాయిజాన్ సల్మాన్ పేరు చెప్పుకోవాలి. ‘ఎలిజిబుల్’ అనే మాట కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఇప్పటికైనా ఆయన ‘ఊఁ’ అంటే చాలు.. ఇండియాలోని భామలే కాదు.. విదేశాల నుండి కూడా అప్సరసలు పెళ్ళికి క్యూ కడతారు. ఆయన ఎలాగూ నిఖాకు ఒప్పుకోడు కాబట్టి మనం భాయిజాన్ షాదీ గురించి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది వదిలేసి టాలీవుడ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్ల సంగతి చూద్దాం.

ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ డౌట్ లేకుండా డార్లింగుదే. ప్రభాస్ ఈమధ్యే నలభైవ పడిలో అడుగుపెట్టాడు. కానీ ప్రభాస్ దగ్గర పెళ్ళి మాట ఎత్తితే ఒక చిరునవ్వే సమాధానం. అంతకు మించి ఏం చెప్పడు. ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారడంతో మనతో పాటుగా హిందీవాళ్ళకు కూడా ప్రభాస్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాడు.. అనే టెన్షన్ పట్టుకుంది.

నితిన్: పైకి వయసు కనిపించదు కానీ నితిన్ వయసు 36. అయినా ఎందుకో ఇంకా పెళ్ళి మీదకు మనసు పోలేదు. ఎప్పుడూ సినిమాల ధ్యాసే తప్ప ఎక్కడ హీరోయిన్ల తో ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేసినట్టు కనీసం రూమర్లు కూడా రావు. డీసెంట్ అండ్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

శర్వానంద్: ఈయన కూడా అంతే.. వయసు పెద్దగా కనిపించదు కానీ 35 ఏళ్ళు. పెళ్ళి మాట ఎత్తడు. అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులు పెళ్ళి గురించి అడిగితే ప్రభాస్ అన్న పెళ్ళి చేసుకున్న తర్వాతే నేను చేసుకుంటా అంటూ నేర్పుగా తప్పించుకున్నాడట. డార్లింగ్ పెళ్ళి అయితే గానీ ఈయన పెళ్ళి సంగతి అలోచించడేమో మరి. ఈ తమ్ముడి కోసం అయినా ప్రభాస్ త్వరలో పెళ్ళి చేసుకోక తప్పేలా లేదు.

రానా దగ్గుబాటి: రానా కూడా ఎలిజిబుల్ బ్యాచిలరే. తెలుగు మాత్రమే కాకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న నటుడు. వయసు 34. ఈయన కూడా పెళ్ళి ఊసెత్తకుండా నెట్టుకొస్తునాడు. మధ్యలో త్రిషతో కాస్త వ్యవహారం ముదిరినట్టు అనిపించినా అది పెళ్ళి వరకూ పోలేదు. రానాకు సొంత ఇమేజ్ తో పాటుగా సూపర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది.. అయినా బాబు ఎందుకో ఆ విషయంలో ముందడుగు వెయ్యడం లేదు.

నిఖిల్ సిద్దార్థ్: నిఖిల్ కూడా చిన్నవాడిలా కనిపిస్తాడు కానీ వయసు 34. నిఖిల్ దృష్టి అంతా సినిమాల మీదే. ఇప్పటికీ వివాహంపై దృష్టిసారించలేదు. లిస్టులో మహా మహులు ఉన్నారు కదా.. నేనెంత అనుకున్నాడో ఏమో కానీ పెళ్ళి టాపిక్ మాట్లాడడు.

సాయి ధరమ్ తేజ్: మెగా మేనల్లుడి వయసు మరీ తక్కువేమీ కాదు.. ఇప్పుడు 33. అయినా ఎందుతో ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టాడు. అప్పుడప్పుడూ లవ్ రూమర్లు వస్తాయి కానీ మెగా మేనల్లుడు అసలు అవి నిజమని ఒప్పుకోడు! అలా అని పెళ్ళి సంగతీ తేల్చడు.

సందీప్ కిషన్: సందీప్ కిషన్ వయసు 32. పైన అంత మంది ఎలిజిబుల్ బ్యాచిలర్లు ఉండడంతో ఎక్కడా ఇంటర్వ్యూలలో సందీప్ ను పెళ్ళి విషయంలో ప్రశ్నలు వేయడం లేదు. అయితే తేజు లాగా సందీప్ పై కూడా లవ్ రూమర్లు వస్తుంటాయి. కానీ అవన్నీ తోసిపుచ్చుతూ ఉంటాడు. అయినా రూమర్లు ఆగవు!

విజయ్ దేవరకొండ.. నాగ శౌర్య ఇద్దరి వయసు 30. ముప్పైలు దాటి పోయిన వారే మ్యారేజ్ సంగతి మాట్లాడడంలేదు.. వారితో పొలిస్తే ఈ ఇద్దరూ చిన్నవాళ్ళే. ఇక ఈ 30 ప్లస్ లిస్టులో ఎవరైనా ఎలిజిబుల్ బ్యాచిలర్ మిస్ అయి ఉంటే క్షమించండి.. కానీ మన ఇండస్ట్రీలో బెండకాయలు ముదురుతున్నాయనే వాస్తవాన్ని మాత్రం గుర్తించండి. అదే పదివేలు.
Please Read Disclaimer