టాలీవుడ్ సినిమాలు.. ఫేక్ వ్యూస్ గోల!

0

ఈమధ్య స్టార్ హీరోల సినిమాల విషయంలో వ్యూస్ ను అటు హీరోలు ఇటు ఫ్యాన్స్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. సినిమా కలెక్షన్స్ విషయంలో అవి ఎంతమాత్రం పనికొస్తాయనేది ఎవరికీ తెలియదు కానీ ఈ వ్యూస్ పోటీతో డిజిటల్ మీడియా సంస్థలు లాభ పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. తమ సాంగ్స్.. టీజర్లు.. ట్రైలర్ల కు భారీ సంఖ్యలో వ్యూస్ రావాలని హీరోలు కూడా పట్టుబడుతున్నారని.. దీంతో పెయిడ్ ప్రమోషన్.. ఫేక్ వ్యూస్ సంస్కృతి ఇప్పటికే మొదలైందని అంటున్నారు.

ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇది ఒక సాధారణమైన వ్యవహారం లాగా మారిందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఈమధ్యే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదలైంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోపే 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వ్యూస్ విషయంలో టాలీవుడ్ లో ఇదో రికార్డు. అయితే ఇందులో డిజిటల్ మీడియా సంస్థల హ్యాండ్ ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ టీజర్ కు పాకిస్తాన్ నుంచి కూడా లక్షల సంఖ్యలో క్లిక్కులు వచ్చాయట. ఇక్కడే చాలామందికి ఫేక్ వ్యూస్ అనుమానాలు బలపడ్డాయి. టీజర్ వ్యూస్ అన్నీ ఫేక్ అని చెప్పలేరు కానీ కొంత మ్యానిపులేషన్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

అలా అని ఒక్క మహేష్ బాబు సినిమాకు మాత్రమే జరుగుతోంది అనుకోవడం భ్రమే. పెయిడ్ ప్రమోషన్ పేరుతో ప్రతి హీరో సినిమాకు జరిగే తంతే ఇదని ఇండస్ట్రీలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలకు ఇలాగే జరిగి ఉంటుందని కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా కలెక్షన్స్ రూపంలో మారతాయో లేదో తెలియని ఈ వ్యూస్ వెంటపడడం.. దానికి నిర్మాత అదనపు బడ్జెట్ కేటాయించాల్సి రావడం దురదృష్టకరమనే కామెంట్ వినబడుతోంది.
Please Read Disclaimer