టాలీవుడ్ న్యూ ట్రెండ్: మల్టిపుల్ లవ్ స్టోరీస్!

0

టాలీవుడ్ మేకర్ల ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఒక జోనర్ లో కనుక సినిమా హిట్ అయినా.. ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని తెలిసినా ఇక అదే జోనర్ లో సినిమాలు తెరకెక్కిస్తారు. ఈమధ్య అడల్ట్ కంటెంట్ సినిమాల జోరు ఎక్కువైనా సంగతి తెలిసిందే. అడల్ట్ సినిమాలే కాదు.. అందమైన లవ్ స్టొరీలపై కూడా మన మేకర్స్ ఇప్పుడు మనసు పారేసుకుంటున్నారు.

లవ్ స్టొరీ అనగానే ఒక హీరో.. ఒక హీరోయిన్ అనుకుంటారేమో.. అది కాదు. ఒక హీరో.. ఆయన జీవితంలో వయసు పెరిగేకొద్ది పలు దశలలో ఒక్కొకరిని ప్రేమించడం.. అలా సాగే మల్టిపుల్ ప్రేమల స్టొరీ. కొన్నేళ్ళ క్రితం రవితేజ హీరోగా తెరకెక్కిన ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా లాంటివి అన్నమాట. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా ‘ప్రేమమ్’ అనే సినిమా కూడా లాంటి థీమ్ తోనే తెరకెక్కింది. ఇక ‘C/o కంచరపాలెం’ లో కూడా అదే స్టైల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. కాకపోతే జస్ట్ లవ్ స్టోరీస్ కాకుండా కులం.. మతం.. దేవుడు లాంటి ఇతర అంశాలను కాస్త సీరియస్ గానే చర్చించారు. ఇప్పుడు ఇలాంటి మల్టిపుల్ లవ్ స్టొరీ సినిమాలు సెట్స్ మీద మూడు ఉన్నాయంటే ఈ ట్రెండ్ ఎంత జోరుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరో తన జీవితంలో పలు దశలలో ఐదు మందితో ప్రేమలో పడతాడు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో సినిమా థీమ్ కూడా ఇదేనట. ఇక శర్వానంద్ -సమంతా నటిస్తున్న ’96’ రీమేక్ కూడా ఇలాంటి సినిమానే. ఈ సినిమాలలో ఏవి హిట్ అయినా ఇతర ఫిలిం మేకర్లు ఇదే బాట పట్టడం ఖాయమే. అలా జరిగితే హీరోయిన్లకు ఫుల్ గా డిమాండ్ పెరుగుతుంది.
Please Read Disclaimer