టాలీవుడ్ లో పాజిటివ్ కేసులున్నా బయటకి చెప్పడం లేదా…?

0

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ వస్తోంది. ఈ వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ వస్తోంది. దీని నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలు కొన్నాళ్ల పాటు ఈ మహమ్మారితో సహజీవనం సాగించాలనే నిర్ణయానికి వచ్చేసారు. దీంతో లాక్ డౌన్ లో సడలింపులు విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతో కేసులు కూడా ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు డాక్టర్లు కరోనా బారిన పడగా తాజాగా సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

బండ్ల గణేష్ కి కరోనా అని తెలియడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇన్ని రోజులు ఇతర ఇండస్ట్రీలలో పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా ఇప్పుడు మన టాలీవుడ్ కి కూడా రావడంతో సెలెబ్రిటీలు అందరూ కలవరపడుతున్నారు. అయితే బండ్ల గణేష్ కి కరోనా అని నిర్ధారణ అవడంతో టాలీవుడ్ మరికొంత మందికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ రూమర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ లోకి ఒక లేడీ డైరెక్టర్ కి కరోనా లక్షణాలు కనిపించగా.. కొన్ని రోజులు ఐసొలేషన్ లో ఉన్న ఆమె ఇటీవలే ప్రమాదం నుండి బయటపడిందట. అంతేకాకుండా ఒక స్టార్ రైటర్ కి కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడట. వీరితో పాటు చాలా మందికి మహమ్మారి సింటమ్స్ కనిపించినప్పటికీ మీడియా అటెన్షన్ మొత్తం వారి మీదకి డైవర్ట్ అవుతుందని చెప్పడం లేదంట.

ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే షూటింగులకు అనుమతులు వస్తుండగా చిత్రీకరణ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినీ ప్రముఖులకు కరోనా అంటూ న్యూస్ రావడంతో ఆలోచనలో పడ్డారట. దీనికి తోడు రోజురోజుకీ కరోనా కేసులు కూడా అధికమవుతుండటంతో.. షూటింగ్స్ మొదలుపెడదాం అనుకుంటున్న వారు తమ నిర్ణయం వెనక్కి తీసుకొనే ఆలోచన చేస్తున్నారట. ఇక సీనియర్ హీరోలు సైతం వయసురీత్యా షూటింగ్ కి రావడానికి ససేమిరా అంటున్నారట. కొందరు కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగ్స్ లో పాల్గొనలేమని చెప్తున్నారట. ఈ నేపథ్యంలో షూటింగ్స్ విషయంలో అందరూ వేచి చూసే ధోరణి అవలంభించి అవకాశం ఉందని అంటున్నారు.
Please Read Disclaimer