నిర్మాతల గిల్డ్ అదుపులో టాలీవుడ్ మీడియా!

0

నిప్పు లేనిదే పొగ రాదు. అందుకే నివురు గప్పిన నిప్పులాంటి నిజం ఒకటి టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ మీడియాల్లో తాజాగా చర్చకు వస్తోంది. గత కొంతకాలంగా `మీడియా కంట్రోల్` అన్న మాట పదే పదే చర్చకు రావడం.. దానిపై 300 మంది పైగా టాలీవుడ్ జర్నలిస్టుల్లో- మీడియా హౌస్ లలో విస్త్రతంగా డిస్కషన్ సాగడం తెలిసిందే. అయితే ఈ మీడియా కంట్రోల్ వెనక ఉన్న కొన్ని నిజాలు నిశ్చేష్టుల్ని చేసే విధంగా ఉన్నాయన్నదానిపైనా ప్రస్తుతం చర్చ సాగుతోంది. అసలు ఈ మీడియా కంట్రోల్ వెనక ఉన్న పెద్దన్నల గురించి ఎందరికి తెలుసు? అంటే తెలిసింది కొందరికే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దీని కంటే ముందే టాలీవుడ్ ఇన్ సైడ్ టాప్ ట్రెండింగ్ పరిణామాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుగు సినీపరిశ్రమలో ఆ నలుగురు లేదా ఆ పది మంది రాజకీయాల గురించి తెలిసిందే. మోస్ట్ పవర్ ఫుల్ `కంట్రోల్` అన్న పదం పుట్టుకకు కారణం వీళ్లేనని చాలా మంది చిన్న నిర్మాతలు ఆరోపిస్తుంటారు. ఈ కంట్రోల్ ఒక్క రంగంలో కాదు.. పరిశ్రమలో అత్యంత కీలకమైన డిస్ట్రిబ్యూషన్.. ఎగ్జిబిషన్ రంగంలో ఇప్పటికే `కంట్రోల్ సిస్టమ్`ని బలంగా అప్లయ్ చేశారు. అలాగే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (డీఎస్ పీ లేదా ప్రొజెక్టర్స్ వ్యవస్థ) లోనూ ఇప్పటికే వీళ్లదే పైచేయిగా కనిపిస్తోంది. అక్కడా ఇతరులెవరూ రాకుండా అణచివేయడంలో అగ్రనిర్మాతలు కం ఎగ్జిబిటర్ల ముద్ర బలంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

అంతేకాదు.. ఇటీవల జరిగిన ఫిలించాంబర్ ఎన్నికల్లోనూ నిర్మాతల గిల్డ్ పై చెయ్యి సాధించాలని చాలానే ప్రయత్నించింది. కానీ అక్కడ మెజారిటీ చిన్న నిర్మాతలు కేవలం సి.కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతో అక్కడ పప్పులు ఉడకలేదు. అలాగే అధిక భాగం చిన్న నిర్మాతల ఓట్లు ఉన్న నిర్మాతల మండలి ఎన్నికలకు ఉద్ధేశపూర్వకంగానే నిర్మాతల గిల్డ్ దూరంగా ఉందన్న ప్రచారం ఇటీవల ఎన్నికల్లో సాగింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ పేరుతో వీళ్లంతా సపరేట్ కుంపటి పెట్టుకుని రహస్యంగా చర్చలు సాగిస్తూ నిరంతరం టాలీవుడ్ లో రకరకాల ఛేంజెస్ తేవాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా చాలా రంగాల్లో మార్పులు కోరుతున్నారు. వ్యవస్థల్ని తమ కంట్రోల్ లో ఉంచుకునే దిశగా చర్యల్ని తీసుకుంటున్నారు.

సినిమాలు తీయకుండా నిర్మాతలం అని చెప్పుకుంటూ నిర్మాతల మండలిలో పదవులు అనుభవిస్తున్న వారిని.. అలాగే సంక్షేమ పథకాల్ని అనుభవిస్తున్న వారిని కట్టడి చేసేందుకు గిల్డ్ చాలానే ప్రయత్నిస్తోందని సమాచారం. ప్రస్తుతం చిన్న నిర్మాతలంతా ఈ తరహా రాజకీయాలపై సీరియస్ గా ముచ్చటించుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న రకరకాల సమస్యలు.. వీటి కరెక్షన్స్ విషయమై నిర్మాతల గిల్డ్ రహస్య సమావేశంలో చర్చించింది. ఇందులో ప్రధానంగా మీడియా కరెక్షన్ కూడా ఉందన్న చర్చా అంతకంతకు వేడెక్కిస్తోంది. ఈ వ్యవహారంపై దాదాపు 150 మీడియా కంపెనీల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ టాలీవుడ్ 88ఏళ్ల హిస్టరీలో ఎన్నడూ చేయని ప్రయత్నమిది. అందుకే చాలా వరకూ ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో టాలీవుడ్ తో అనుబంధం ఉన్న చాలా చాలా మీడియా కంపెనీల్లో దీనిపై హాట్ డిబేట్ రన్ అవుతోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home