సీనియర్ నిర్మాత కన్నుమూత.. వెంకటేష్, ప్రభాస్‌తో సినిమాలు

0

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నటుడు శ్రీకాంత్ తండ్రి కన్నుమూశారు. అంతకు ముందు హాస్యనటుడు అలీ తల్లి మృతిచెందారు. గొల్లపూడి మారుతిరావుతో పాటు మరికొందరు ప్రముఖులు గత రెండు మూడు నెలల్లో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నటుడు జనార్ధన రావు మృతిచెందారు. ఇప్పుడు టాలీవుడ్ మరో విషాద వార్తను వినాల్సి వచ్చింది. సీనియర్ నిర్మాత సి. వెంకట్ రాజు కన్నుమూశారు.

అనారోగ్యం కారణంగా ఆదివారం (మార్చి 8న) వెంకట్ రాజు చెన్నైలో మృతిచెందినట్టు టాలీవుడ్ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. సోమవారం వెంకట్ రాజు అంత్యక్రియలు చెన్నైలో జరుగుతాయని పేర్కొన్నారు.

శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్, గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై బి. శివరాజుతో కలిసి వెంకట్ రాజు సినిమాలను నిర్మించారు. వెంకట్ రాజు అత్యధికంగా విక్టరీ వెంకటేష్ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘2 టౌన్ రౌడీ’. ఆ తరaవాత ‘పవిత్ర బంధం’, ‘పెళ్లిచేసుకుందాం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను వెంకటేష్ హీరోగా నిర్మించారు. ‘ఘర్షణ’ సినిమాకు కూడా వెంకట్ రాజు ఒక నిర్మాత. ఇక ప్రభాస్‌తో ‘చక్రం’ వంటి మంచి సినిమాను వెంకట్ రాజు నిర్మించారు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-