స్టార్ వారసుడు సినిమాలంటే భయపడుతున్నాడట!

0

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది వారసులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో ఎక్కువ శాతం మంది వారసులే. ముందు ముందు కూడా చాలా మంది రాబోతున్నారు. హీరోల పిల్లలు మాత్రమే కాకుండా దర్శకుల మరియు నిర్మాతల పిల్లలను కూడా హీరోలుగా పరిచయం చేస్తున్నారు. ఎంతో మంది పిల్లలు హీరోలుగా పరిచయం అయితే అవుతున్నారు కాని కొందరు మాత్రమే స్టార్స్ గా నిలబడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో వారసులుగా వస్తున్న వారిలో కొందరికి మాత్రమే మంచి సక్సెస్ లు దక్కాయి.

ఈ నేపథ్యంలోనే ఒక హీరో కూడా తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ హీరో అభిమానులు కూడా జూనియర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ హీరో త్వరలోనే వారసుడు వస్తాడు అంటూ ప్రకటిస్తున్నాడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదే కథ నడుస్తోంది. ఆమద్య ట్రైనింగ్ తీసుకుంటున్నాడు త్వరలోనే వస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. కథలు వింటున్నాం తప్పకుండా ఒక మంచి కథతో కొడుకును తీసుకు వస్తానంటూ ఆ హీరో కూడా చెప్పాడు. తీరా ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.

ఆ హీరో కొడుకుకు అస్సలు హీరో అవ్వాలనే ఆసక్తి లేదట. అతడి సన్నిహితులు మరియు స్నేహితులు కొందరు ఇండస్ట్రీలోకి వెళ్లి నిరాశ పడ్డారట. సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు కాని ఎక్కువ శాతం మంది ప్రేక్షకుల ఆధరణకు నోచుకోలేదట. అందుకే ఆ హీరో తనయుడు హీరో అయ్యేందుకు భయపడుతున్నాడట. ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం ఎందుకు అంటూ చాలా భయంతో సినిమాలంటేనే ఆమడ దూరం పోతున్నాడట. కాని ఆ హీరో మాత్రం కొడును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరో అవ్వాలనే ఇష్టం లేకపోవడం వల్ల ఆ కుర్రాడు కాస్త లావు కూడా అయ్యాడని అంటున్నారు. ఫ్యాన్స్ కోసం అయినా పాపం ఆ కుర్రాడు హీరోగా పరిచయం అవ్వాలని సినీ వర్గాల వారు కోరుకుంటున్నారు. ఎంతో మంది హీరోలు కావాలని నిర్మాతల చుట్టు తిరుగుతుంటే ఇతడు మాత్రం స్టార్ హీరో అయ్యే ఛాన్స్ ఉన్నా వద్దనుకుంటున్నాడంటూ ఇండస్ట్రీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.