నిరాశతో ఆత్మహత్యలు వద్దే వద్దంటున్న స్టార్స్

0

సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ లో రూల్స్ బుక్ ని మార్చేస్తోంది. రూలర్స్.. మాఫియా గ్యాంగ్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. కుటుంబ పరిపాలన ఇక పరిశ్రమలో ఎంతో కాలం చెల్లదు! అన్న సిగ్నల్ అయితే అందింది. అయితే ఇది అంతం లేని సమస్య. నెప్టోయిజం ఎప్పటికీ ఎగ్జిస్టెడ్. అయితే కొత్తగా వచ్చే ట్యాలెంట్ ఎంతో ఓర్పు నేర్పుతో ఈ రంగంలో ఎదగాల్సి ఉంటుందన్న విశ్లేషణ సాగుతోంది.

మరో కోణంలో చూస్తే.. అన్ని పరిశ్రమల్ని ఈ ఘటన అప్రమత్తం చేసిందనే చెప్పాలి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం మానసిక ఆందోళన.. నిరాశ నిస్పృహలు ఎలా ఆత్మహత్యకు ప్రేరేపించాయి? అన్నదానిపై మునుపెన్నడూ లేనంత చర్చ సాగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యోదంతం కూడా చర్చల్లోకి వచ్చింది. ఒక బలహీన క్షణాన జరిగిన అరుదైన ఘటనలు అవి. ఊహాతీతమైన మరణాలు ఎంతో బాధించాయి. అందుకే అటు బాలీవుడ్ సహా ఇటు అనేక మంది టాలీవుడ్ తారలు కూడా ఆత్మ హత్యలపై అవగాహన పెంచడానికి నిరాశ తో పోరాడే శక్తిని ఆర్టిస్టుల్లో పెంచేందుకు సరికొత్త డిబేట్ కి తెరలేపారు.

చాలా మంది యువ తరం తారలు సోషల్ మీడియాలో ఈ ఉదంతానికి విస్త్రత ప్రాచుర్యం కల్పిస్తూ అలా జరగకుండా ఇకపై ఆపేందుకు ఏం చేయాలి? అంటూ.. మరో ఇద్దరు స్నేహితులను ట్యాగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సందేశాన్ని కాపీ చేసి పోస్ట్ చేయమని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ స్నేహితులను మరింతగా ట్యాగ్ చేయమని అభ్యర్థిస్తున్నారు. ఈ సందేశంలో ప్రధానంగా రెండు ఆత్మహత్య అవగాహన కోడ్స్ ఫోన్ నంబర్లను ప్రచారం చేస్తున్నారు. అమెరికా కోసం: 1-800-273-8255 .. భారతదేశం కోసం: 09152987821 నంబర్లను వైరల్ చేస్తున్నారు.

ఈ మిషన్ లో రానా దగ్గుబాటి- రకుల్ ప్రీత్- లావణ్య త్రిపాఠి- సాయి తేజ్- లక్ష్మి మంచు- ఈషా రెబ్బా- రితు వర్మ- వెన్నెల కిషోర్- రాహుల్ రవీంద్రన్ తదితర తారలు పాల్గొన్నారు. మరెంతో మంది నటీనటులు ఈ క్యాంపెయిన్ లో చేరుతున్నారు. సోషల్ మీడియాల్లో విస్త్రత ప్రచారం చేస్తున్నారు.
Please Read Disclaimer