స్టార్ ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు?

0

టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో పెద్ద స్టార్ హీరో ఫ్యామిలిస్ లో ఎవరి పెళ్లి జరగలేదు. ఇలాంటివి వచ్చినప్పుడు ఒకేచోట తారాతోరణాన్ని చూసే ఛాన్స్ దక్కుతుంది కాబట్టి పబ్లిక్ లోనూ వీటి మీద ఆసక్తి నెలకొని ఉంటుంది. త్వరలో అలాంటి శుభకార్యం జరిగే ఛాన్స్ ఉందని టాక్. వివరాల్లోకి వెళ్తే తెలుగు సినిమా పరిశ్రమలోనే అతి పెద్ద స్టార్ కుటుంబంగా భావించే ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయట.

సదరు అగ్ర హీరో రెండో తమ్ముడి కొడుకు వివాహం గురించి ఇప్పటికే వెతుకులాట మొదలైందని సమాచారం. ఇప్పటికే ఆ యూత్ హీరో ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. వచ్చేనెల ఊర మాస్ అవతారంలో చేసిన ఓ రీమేక్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇతనికి పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం నాన్న హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చించినట్టు సమాచారం. అమ్మాయి లక్షణంగా ఉండటంతో పాటు మన హీరోకు కూడా నచ్చిందట.

అయితే ఇది కేవలం ప్రతిపాదన స్టేజి లోనే ఉండటం వల్ల ఖచ్చితంగా ఫిక్స్ అవుతుందో లేదో చెప్పలేమని సదరు హీరో కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న న్యూస్. ఈ హీరోకు ఓ చెల్లి ఉంది. ఆ అమ్మాయీ నాలుగైదు సినిమాలు చేసింది కానీ అదృష్టం కలిసి రాక అన్ని డిజాస్టర్ అయ్యాయి. ముందు తనకే పెళ్లి చేయాలనుకున్నప్పటికీ ఇంకొంత టైం అడిగిందని అందుకే ముందు అన్నయ్య పెళ్ళికి పప్పన్నం పెట్టాలని ఫిక్స్ అయ్యారట. మరి ఇది ప్రపోజల్ స్టేజిలోనే ఆగిపోతుందా లేక అబ్బాయి పెళ్ళికి అడుగులు ముందుకెళతాయా వేచి చూడాలి.
Please Read Disclaimer