జక్కన్న వల్ల అన్ని కోట్ల బిజినెస్ కి ఎసరు?

0

ఆర్.ఆర్.ఆర్ విషయంలో రకరకాల థియరీస్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజం ఎంత? అన్నది అటుంచితే ఎవరికి వారు ఇష్టానుసారం ప్రచారం చేసేస్తుండడం చూస్తుంటే చిత్రబృందానికి చాలానే షివరింగ్ వచ్చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే నిర్మాత దానయ్యకు మహమ్మారీ లాక్ డౌన్ సమయంలో చిరాకులు పరాకులు ఎక్కువై ఆరోగ్య సమస్యలు తప్పలేదని కొందరు ప్రచారం చేయడం నచ్చలేదట.

ఇదిలా ఉండగానే జక్కన్న వల్ల వాళ్లంతా లాకైపోయారు! అంటూ మరో ప్రచారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఎవరెవరు లాకయ్యారు? అంటే.. రామ్ చరణ్- రామారావులతో పాటు కొరటాల – త్రివిక్రమ్ కూడా లాకైపోయారన్నది దాని సారాంశం. వీళ్ల వల్ల వందల కోట్ట బిజినెస్ అలానే నిలిచిపోయిందని మరో ప్రచారం. కరోనా క్రైసిస్ వల్ల ఆర్.ఆర్.ఆర్ అంతకంతకు వాయిదా పడుతోంది. డిసెంబర్ కానీ జనవరి లో కానీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టరు. అటుపైనా సుదీర్థంగా ఏడెనిమిది నెలల పాటు షూటింగు చేయాలి.. సైమల్టేనియస్ గా నిర్మాణానంతర పనులు చేయాలి కాబట్టి అంత కాలం వీళ్లంతా లాకైపోయినట్టేనంటూ ప్రచారం సాగుతోంది.

“చరణ్ `ఆచార్య`లో నటించాల్సి ఉంది. అలాగే తారక్ త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. వీళ్లను వదిలితే కానీ ఆ ఇద్దరు దర్శకులకు రిలీఫ్ రాదు. కానీ జక్కన్న ముందస్తు ఒప్పందం అందుకు మోకాలడ్డుతుంది. సమస్య పరిష్కారం కాదు!“ అంటూ ఒకటే ప్రచారం వేడెక్కించేస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలెంత అన్నది అటుంచితే కొరటాలకు కాల్షీట్లు ఇచ్చుకోవచ్చని చరణ్ కి.. త్రివిక్రమ్ కి క్లీన్ గా డేట్స్ ఇచ్చుకోవచ్చని ఎన్టీఆర్ జక్కన్న చెప్పారని మరో ప్రచారం సాగింది. అయితే ఇన్ని థియరీస్ నడుమ ఏ థియరీ కరెక్ట్ అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వీటన్నిటికీ జక్కన్న చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాల్లో ఏదైనా చెబుతాడా? అన్నది వేచి చూడాలి.